Champions League Celebrations | ఛాంపియన్స్​ లీగ్​లో గెలుపు.. హింసాత్మకంగా మారిన సంబరాలు

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Champions League Celebrations | ఛాంపియన్స్ లీగ్ (Champions League)​లో పీఎస్​జీ గెలిచిన సందర్భంగా పారిస్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్స్ మ్యాచ్‌లో ఆర్సెనల్‌పై PSG గెలవడంతో రోడ్ల మీదకు చేరుకొని అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో పలువురు హింసకు పాల్పడ్డారు.

Champions League Celebrations

ఛాంపియన్స్ లీగ్ ఫైనల్‌లో పారిస్ (Paris) సెయింట్-జెర్మైన్ విజయం సాధించిన తర్వాత వేలాది మంది వీధుల్లోకి రావడంతో హింసాత్మక ఘర్షణల చెలరేగాయి. దీంతో పోలీసులు 280 మందికి పైగా వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఫ్రెంచ్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం దేశవ్యాప్తంగా 416 మందిని అదుపులోకి తీసుకున్నారు, వీరిలో పారిస్‌లో పట్టుబడిన 283 మంది కూడా ఉన్నారు. ఈ ఘటనలో ఏడుగురు అధికారులు గాయపడ్డారు. ఆరు వాహనాలు, రెండు వ్యాపార సంస్థలు దెబ్బతిన్నాయి.

Champions League Celebrations | పోలీస్​ స్టేషన్​పై దాడి

Champions League Celebrations

పీఎస్​జీ అభిమానులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. పలువురు ఆకతాయిలు కార్లు, దుకాణాలు ధ్వంసం చేశారు. దీంతో వారిపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దుండగులు ఓ పోలీస్​ స్టేషన్​పై కూడా దాడి చేశారు. మద్దతుదారుల బృందం ఒకటి పారిస్ రింగ్ రోడ్ అయిన బౌలేవార్డ్ పెరిఫెరిక్‌లోకి చొరబడి, కొంతసేపు ట్రాఫిక్‌ను నిలిపివేసి, ఫ్లేర్లను వెలిగించింది. ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నంలో పారిస్ ట్రామ్ లైన్లను నిలిపివేశారు, అనేక మెట్రో స్టేషన్లను మూసివేశారు మరియు కొన్ని చోట్ల బస్సుల రాకపోకలను నిలిపివేశారు.

ఇది కూడా చదవండి..: US Green Card | గ్రీన్‌కార్డ్ విధానంలో మార్పు లేదు.. నిబంధనలపై క్లారిటీ ఇచ్చిన అమెరికా

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *