Yashasvi Jaiswal | రాణించిన జైస్వాల్​.. భారత్ స్కోర్​​ 159/1

న్యూజిలాండ్​తో జరుగుతున్న తొలి టెస్ట్​లో భారత ఆటగాళ్లు సత్తా చాటారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Yashasvi Jaiswal | న్యూజిలాండ్​తో జరుగుతున్న తొలి టెస్ట్​లో భారత ఆటగాళ్లు సత్తా చాటారు. రెండో రోజు ఆట ముగిసే సమాయానికి టీ ఇండియా ఒక వికెట్ నష్టపోయి 159 పరుగులు చేసింది.

తొలి రోజు కివీస్​ ఆటగాళ్లు హెన్రీ నికోల్స్​, లాథమ్​ రాణించారు. 243 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆ జట్టు 368 పరుగులకు ఆలౌట్​ అయింది. నికోల్స్​ 335 బంతుల్లో 175 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఆటగాడు లాథమ్​ సైతం సెంచరీ (118) చేశాడు. మిగతా బ్యాట్స్​మెన్​ విఫలం కావడంతో కివీస్​ జట్టు 368 పరుగులకు ఆలౌట్​ అయింది.

Yashasvi Jaiswal | రాహుల్ హాఫ్​ సెంచరీ

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్​ (India)కు శుభారంభం లభించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్​ 89 పరుగులు, కేఎల్​ రాహుల్ 52 పరుగులు చేశారు. జైస్వాల్ అవుట్​ అయిన తర్వాత దేవదూత్​ పడిక్కల్​ క్రీజులోకి వచ్చాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి రాహుల్​, పడిక్కల్​ (16) క్రీజులో ఉన్నారు. భారత్​ ఒక వికెట్​ నష్టపోయి 159 పరుగులు చేసింది. 209 పరుగులు వెనుకబడి ఉంది.

ఇది కూడా చదవండి..: Suman Hockey Promotion | అంతర్జాతీయ హాకీ సమాఖ్య ప్యానెల్ టెక్నికల్ అఫీషియల్‌గా సుమన్​కు పదోన్నతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *