Suman Hockey Promotion | అంతర్జాతీయ హాకీ సమాఖ్య ప్యానెల్ టెక్నికల్ అఫీషియల్‌గా సుమన్​కు పదోన్నతి

అంతర్జాతీయ హాకీ సమాఖ్య ప్యానెల్ టెక్నికల్ అఫీషియల్‌గా సుమన్​కు పదోన్నతి లభించింది.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Suman Hockey Promotion | అంతర్జాతీయ హాకీ సమాఖ్య (FIH) ప్యానెల్ టెక్నికల్ అఫీషియల్‌గా సుమన్​కు పదోన్నతి లభించింది. ఈ మేరకు ఎఫ్​ఐహెచ్​ నుంచి ఉత్తర్వులు అందాయి.

Suman Hockey Promotion | సిఫార్సుకు ఆమోదం..

​ఈ మేరకు ఎఫ్​ఐహెచ్​ అధ్యక్షుడు తయ్యబ్ ఇక్రమ్ నవంబర్ 18, 2026న సుమన్‌కు అధికారికంగా లేఖ పంపారు. హాకీ క్రీడలో అంతర్జాతీయ ప్యానెల్ టెక్నికల్ ఆఫీషియల్‌గా సుమన్‌కు పదోన్నతి కల్పించాలనే ప్రతిపాదనను ఎఫ్​ఐహెచ్​ టెక్నికల్ ఆఫీషియల్స్ కమిటీ ఆమోదించింది. ఈ నియామక వివరాలను సుమన్ ప్రాతినిధ్యం వహిస్తున్న జాతీయ సంఘంతో పాటు సంబంధిత ఖండాంతర సమాఖ్యకు కూడా ఎఫ్​ఐహెచ్​ పంపింది.

హాకీ క్రీడ పట్ల సుమన్ చూపుతున్న అంకితభావం, సహకారాన్ని తయ్యబ్ ఇక్రమ్ ప్రశంసించారు. అంతర్జాతీయ హాకీలో సుమన్ మరింత విజయవంతంగా రాణించాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలిపారు.

ఇది కూడా చదవండి: ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం యూజర్లకు ఊరట కలిగించే వార్త. 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *