అక్షరటుడే గాంధారి: Fox Rescue Gandhari | అటవీ ప్రాంతం నుంచి పొలంలోని ఓ బావి వద్దకు వచ్చిన నక్క అదుపుతప్పి బావిలో పడిపోయింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి (Gandhari) మండలంలోని చిన్నగుజ్జుల్ గ్రామంలో చోటుచేసుకుంది.
Fox Rescue Gandhari | నీటి కోసం వచ్చిన నక్క..
అటువైపుగా వెళ్లిన స్థానికులు గమనించి వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. స్పందించిన అటవీశాఖ సిబ్బంది రెస్క్యూ చేపట్టి (Wildlife Rescue) బావిలో ఉన్న నక్కను బయటకు తీశారు. బావిలో నుంచి బయటకు వచ్చిన నక్క అడవి వైపు పరిగెత్తింది. ఈ రెస్క్యూలో ఎఫ్ఆర్వో రమేష్, బీట్ ఆఫీసర్ నవీన్ కుమార్ అటవీ శాఖ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: గురుగ్రామ్–ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్‌లో వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.