అక్షరటుడే, వెబ్‌డెస్క్: DMart Ready | దేశీయ రిటైల్ రంగంలో ప్రముఖ సంస్థ డీమార్ట్ తన ఈ-కామర్స్ వ్యాపారానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ గ్రోసరీ ప్లాట్‌ఫామ్ డీమార్ట్ రెడీ సేవలను ఏడు నగరాల్లో నిలిపివేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. 2026 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలను వెల్లడించిన సందర్భంగా ఈ విషయాన్ని అవెన్యూ సూపర్‌మార్ట్స్ వెల్లడించింది.
DMart Ready | కొనుగోలు విధానంలో మార్పుల దృష్ట్యా..
మార్కెట్లో క్విక్ కామర్స్ సేవల మధ్య పెరుగుతున్న పోటీ, వినియోగదారుల కొనుగోలు విధానంలో వస్తున్న మార్పులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. భవిష్యత్తులో మెరుగైన పనితీరు కనబరిచే ప్రాంతాలపై దృష్టి సారించేందుకు వ్యాపార వ్యూహాన్ని పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు వెల్లడించింది.
అవెన్యూ ఈ-కామర్స్ లిమిటెడ్ సీఈఓ విక్రమ్ దాసు మాట్లాడుతూ, సంస్థ తన ఆన్‌లైన్ వ్యాపార నమూనాను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా ఆశించిన ఫలితాలు రాని ఏడు నగరాల్లో సేవలను నిలిపివేసినట్లు తెలిపారు. జూన్ 30 నాటికి డీమార్ట్ రెడీ సేవలు దేశంలోని 11 ప్రధాన నగరాల్లో మాత్రమే కొనసాగనున్నాయని చెప్పారు. ఇకపై మెట్రో నగరాల్లో ఆన్‌లైన్ సేవలను మరింత బలోపేతం చేయడంపై కంపెనీ దృష్టి కేంద్రీకరించనున్నట్లు వివరించారు.
Maa Inti Bangaram | 100 కోట్ల క్లబ్‌లోకి ‘మా ఇంటి బంగారం’.. సమంత ఆనందం వైరల్
DMart Ready | రిటైల్ వ్యాపారంలోనూ మందగమనం
ఇదిలా ఉండగా, కంపెనీ ప్రధాన రిటైల్ వ్యాపారంలోనూ వృద్ధి గత ఏడాదితో పోలిస్తే కొంత మందగించింది. రెండేళ్లకు పైగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న స్టోర్లలో లైక్-ఫర్-లైక్ అమ్మకాల వృద్ధి గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన 7.1 శాతం నుంచి ఈసారి 5.5 శాతానికి తగ్గినట్లు కంపెనీ వెల్లడించింది.
అయితే మెట్రో నగరాలతో పోలిస్తే మెట్రోయేతర ప్రాంతాల్లోని డీమార్ట్ స్టోర్లు మెరుగైన పనితీరు కనబరిచినట్లు సంస్థ పేర్కొంది. రాబోయే కాలంలో వ్యాపార విస్తరణ, లాభదాయకతపై మరింత దృష్టి సారించనున్నట్లు కంపెనీ సంకేతాలు ఇచ్చింది.