అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market Losses | జియో పొలిటికల్ టెన్షన్స్ కొనసాగుతుండడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కనిష్టాల వద్ద కొనుగోళ్లకు మద్దతుగా నిలుస్తూ గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market)లో బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ బుధవారం రోజంతా లాభనష్టాల మధ్య ఊగిసలాడి చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి.
Stock Market Losses | నష్టాలతో ప్రారంభమై..
దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 70 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 142 పాయింట్లు కోల్పోయింది. అక్కడినుంచి కోలుకుని ఇంట్రాడేలో గరిష్టంగా 427 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 23 పాయింట్ల నష్టంతో ప్రారంభమె మరో 12 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి కోలుకుని 115 పాయింట్లు పెరిగింది. అయితే ఇంట్రాడే గరిష్టాల వద్ద అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్ 476 పాయింట్లు, నిఫ్టీ 125 పాయింట్లు క్షీణించాయి. చివరికి సెన్సెక్స్ 141 పాయింట్ల నష్టంతో 75,867 వద్ద, నిఫ్టీ 6 పాయింట్ల నష్టంతో 23,907 వద్ద స్థిరపడ్డాయి.
Stock Market Losses | మిక్స్‌డ్‌గా సూచీలు..
పవర్ ఇండెక్స్ 3.27 శాతం, క్యాపిటల్ గూడ్స్ 3.21 శాతం, మీడియా 3.05 శాతం, యుటిలిటీ 2.39 శాతం, మెటల్ 1.67 శాతం, ఆటో 1.45 శాతం శాతం, టెలికాం 1.02 శాతం లాభపడగా.. ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.64 శాతం, బ్యాంక్ నిఫ్టీ 0.43 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.27 శాతం, ఐటీ 0.27 శాతం నష్టపోయాయి.
Stock Market Losses | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,275 కంపెనీలు లాభపడగా 1,945 స్టాక్స్ నష్టపోయాయి. 174 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 162 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 40 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. బీఎస్ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 2 లక్షల కోట్ల మేర పెరిగింది.
Top gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 20 స్టాక్ లాభపడగా.. 10 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. పవర్‌గ్రిడ్ 2.56 శాతం, ఎటర్నల్ 2.54 శాతం, ఎన్టీపీసీ 2.14 శాతం, టాటాస్టీల్ 2.04 శాతం, ఇండిగో 1.90 శాతం లాభపడ్డాయి.
Top losers : హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ 2.63 శాతం, ఇన్ఫోసిస్ 0.71 శాతం, ఐటీసీ 0.61 శాతం, హెచ్యూఎల్ 0.53 శాతం, రిలయన్స్ 0.51 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి..: Ferrari EV | ఈవీ రేస్‌లోకి ఫెరారీ.. లూస్ పేరుతో ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు


