Ferrari EV | ఈవీ రేస్‌లోకి ఫెరారీ.. లూస్ పేరుతో ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ferrari EV | ప్రపంచ ప్రసిద్ధ ఇటాలియన్ లగ్జరీ కార్ల (Italian luxury cars) తయారీ సంస్థ ఫెరారీ తన ఆటోమొబైల్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు ప్రపంచం వేగంగా అడుగులు వేస్తున్న సమయంలో తన మొట్టమొదటి ఫుల్లీ ఎలక్ట్రిక్ వాహనాన్ని ‘లూస్ ’ పేరుతో తీసుకువస్తోంది. ఇటీవల రోమ్‌లో దీనిని ఆవిష్కరించింది. 1,035 బీహెచ్‌పీ పవర్, 530కేఎం రేంజ్‌తో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ బీస్ట్, పెట్రోల్ సూపర్ కార్లకు ఏమాత్రం తీసిపోదని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. కారు బరువు 2,260 కిలోల వరకు ఉంటుంది. దీని ఫీచర్స్ తెలుసుకుందామా..

డిజైన్ : లూస్ అనేది ఫెరారీ మొదటి 4 డోర్ల ఎలక్ట్రిక్ మోడల్. రెట్రో థీమ్‌ను ఆధారంగా తీసుకుని రూపొందించిన ఈ మోడల్‌లో వంపు తిరిగిన సాఫ్ట్ లైన్స్, మినిమలిస్ట్ అప్రోచ్, ఎరోడైనమిక్స్‌కు అనుగుణంగా తీర్చిదిద్దిన బాడీ స్ట్రక్చర్ స్పష్టంగా కనిపిస్తాయి. దీని గ్లాస్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది. దీంతో కారు మరింత ఓపెన్‌గా, ఫ్యూచరిస్టిక్‌గా కనిపిస్తుంది. ముందు భాగంలో బాడీ కలర్ ఎలిమెంట్స్ చాలా తక్కువగా ఉండగా, బానెట్, గ్రిల్ ఏరియా, లోయర్ బంపర్‌పై నలుపు రంగు హైలైట్‌గా నిలుస్తున్నాయి. ఈ డిజైన్ కారణంగా కారు మరింత అగ్రెసివ్‌గా, స్పోర్టీగా కనిపిస్తుంది.

5 సీటర్ : ఫెరారీ తయారు చేసిన మొట్టమొదటి 5 సీటర్ కారు ఇదే. ఈ కారులో ఐదుగురు వ్యక్తులు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. కారు లోపల అధునాతన సదుపాయాలు ఉంటాయి. అత్యాధునిక కస్టమ్ ఓఎల్ఈడీ స్క్రీన్‌లు, ఇంటిగ్రేటెడ్ బటన్లు ఉన్నాయి.

Ferrari EV | చక్రానికో మోటారు..

ఫెరారీ సంప్రదాయ స్పోర్ట్స్ కార్లకు భిన్నంగా దీనిని ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ కోసమే ప్రత్యేకంగా రూపొందించిన కొత్త ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు. దీంతో లూస్‌లో క్యాబిన్ స్పేస్ పెరిగింది. డ్రైవింగ్ లేఅవుట్ కూడా పూర్తిగా విభిన్నంగా ఉంటుంది. ఈ కారు నాలుగు ఎలక్ట్రిక్ మోటార్లతో రూపొందించబడింది. ప్రతి చక్రానికి ఒక మోటార్ చొప్పున ఏర్పాటు చేయడం వల్ల పవర్ డెలివరీ పూర్తిగా ఖచ్చితంగా, అద్భుతంగా జరుగుతుంది. నాలుగు చక్రాలు కలిపి 1,035.27 బీహెచ్‌పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తాయి.

Ferrari EV | 2.5 సెకన్లలో 100 కేఎంపీహెచ్ వేగం..

ఈ ఈవీ కారు 2.5 సెకన్లలో 0 నుంచి 100 కేఎంపీహెచ్ వేగాన్ని, 6.8 సెకన్లలో 0 నుంచి 200 కేఎంపీహెచ్ వేగాన్ని అందుకోగలదు. టాప్ స్పీడ్ 310 కేఎంపీహెచ్ కంటే ఎక్కువ. ఎఫ80 హైపర్‌కార్ నుంచి తీసుకున్న రియర్ వీల్ స్టీరింగ్, యాక్టివ్ సస్పెన్షన్ కూడా ఇందులో ఉన్నాయి.

Ferrari EV | పవర్ మోడ్స్..

డ్రైవింగ్ అనుభవాన్ని మరింత ఫ్లెక్సిబుల్‌గా మార్చడానికి ఫెరారీ మూడు పవర్ మోడ్‌లను అందించింది. రేంజ్ మోడ్‌లో ఈ కారు సుమారు 430 హెచ్పీ వరకు ఉపయోగించి ఎక్కువ దూరం ప్రయాణించేందుకు ఫోకస్ చేస్తుంది. టూర్ మోడ్‌లో 617 హెచ్పీ శక్తిని, పర్ఫార్మెన్స్ మోడ్‌లో 986 హెచ్పీ వరకు శక్తిని ప్రదర్శిస్తుంది. అవసరమైనప్పుడు లాంచ్ కంట్రోల్ ఉపయోగించి గరిష్టంగా 1050 హెచ్పీ పవర్‌ను విడుదల చేయగలదు.

Ferrari EV

బ్యాటరీ : 122 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంది. దీన్ని పూర్తిగా ఫెరారీ హెడ్‌క్వార్టర్స్‌లో డిజైన్ చేసి, టెస్ట్ చేసి, అసెంబుల్ చేశారు. ఈ ఈవీ గరిష్టంగా 350 కేడబ్ల్యూహెచ్ వరకు చార్జింగ్ స్పీడ్‌ను సపోర్ట్ చేస్తుంది. 20 నిమిషాల్లోనే 70 కేడబ్ల్యూహెచ్ చార్జ్ రికవర్ అవుతుందని కంపెనీ పేర్కొంటోంది. అలాగే దీని డ్రైవింగ్ రేంజ్ 530 కేఎం ఉంటుందని తెలిపింది. బ్యాటరీ టెంపరేచర్‌ను కంట్రోల్‌లో ఉంచడానికి, చార్జింగ్ పర్ఫార్మెన్స్‌ను కాపాడటానికి, పదేపదే హై స్పీడ్ డ్రైవింగ్ చేసినా స్థిరమైన పవర్ అందించడానికి కాంప్లెక్స్ కూలింగ్ సిస్టమ్‌ను అమర్చారు.

ఇది కూడా చదవండి..: Byju Raveendran Jail | బైజూస్ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్‌కు 6 నెలల జైలు శిక్ష

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *