అక్షరటుడే, వెబ్‌డెస్క్: Crude Oil Prices | హర్మూజ్ జలసంధిని తెరిచే శాంతి ప్రతిపాదనలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తిరస్కరించడంతో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ప్రపంచంలో 3వ అతిపెద్ద ముడి చమురు దిగుమతిదారు అయిన భారతదేశానికి ఇది ప్రతికూలం.
అధిక చమురు ధరలు ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయన్న ఆందోళనలతో ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్‌లో అమ్మకాలకు పాల్పడుతున్నారు. దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్లనుంచి అందుతున్న నెగెటివ్ సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్ సైతం సెల్లాఫ్ కు గురవుతోంది. ఈ క్రమంలో బెంచ్‌మార్క్ సూచీలు ఆరు నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి.
Crude Oil Prices | గ్యాప్ డౌన్‌లో ప్రారంభం..
దేశీయ మార్కెట్లు (Domestic markets) సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 161 పాయింట్ల గ్యాప్ డౌన్‌లో ప్రారంభమై మొదట్లో 6 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి అమ్మకాల ఒత్తిడితో 908 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 76 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 16 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 273 పాయింట్లు క్షీణించింది. ఉదయం 11.20 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 1,011 పాయింట్ల నష్టంతో 72,884 వద్ద, నిఫ్టీ 318 పాయింట్ల నష్టంతో 22,821 వద్ద ఉన్నాయి.
Crude Oil Prices | తీవ్ర అమ్మకాల ఒత్తిడి..
అన్ని రంగాల స్టాక్స్ తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 1.9 శాతం పడిపోగా.. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ 17 శాతం నష్టంతో ఉంది. టెలికాం, క్యాపిటల్ గూడ్స్, పవర్, రియాలిటీ, యుటిలిటీ, ఎఫ్ ఎంసీజీ , ఆటో సెక్టార్ల స్టాక్స్ అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి.
Crude Oil Prices | అన్ని స్టాక్స్ నష్టాల్లోనే..
బీఎస్ ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో అన్ని స్టాక్స్ నష్టాలతో సాగుతున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.08 శాతం, హెచ్యూఎల్ 1.97 శాతం, బీఈఎల్ 1.88 శాతం, ఎల్టీ 1.84 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.77 శాతం నష్టాలతో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: Sep 28 Gold Prices | భారీగా బంగారం ధరల పతనం.. చమురు ధరల పెరుగుదలతో మార్కెట్లలో కలకలం