ED Office Protest | ఈడీ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత

హైదరాబాద్ నగరంలోని ఈడీ కార్యాలయం ఎదుటు ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: ED Office Protest | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని ఈడీ కార్యాలయం ఎదుటు ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బీఆర్​ఎస్ నాయకులు, కార్యకర్తలు ఈడీ ఆఫీస్​ ఎదుట ధర్నా నిర్వహించారు.

ఈడీ అధికారులు రెండేళ్ల క్రితం పొంగులేటి నివాసాలపై దాడి చేశారు. రెండేళ్లు అవుతున్నా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని బీఆర్​ఎస్​ నాయకులు నిరసనకు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. పొంగులేటి ఫ్లెక్సీతో నిరసన తెలిపారు.

ED Office Protest | అడ్డుకున్న పోలీసులు

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై ఈడీ రైడ్స్ జరిగి రెండు సంవత్సరాలు పూర్తయినా ఎందుకు వివరాలు బయటపెట్టడం బీఆర్​ఎస్​ నాయకులు డిమాండ్ చేశారు. కార్యాలయం లోపలికి వెళ్లకుండా ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, కేపీ‌ వివేకానందలను, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్ కుమార్ రెడ్డిలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం బీఆర్​ఎస్​ నాయకులు కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.

ఇది కూడా చదవండి..: Gamescraft Rummy Culture | గేమ్స్‌క్రాఫ్ట్‌, రమ్మీ కల్చర్‌కు ED భారీ షాక్.. రూ.442 కోట్ల ఆస్తుల జప్తు!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *