Trump Iran Ceasefire | కాల్పుల విరమణ ప్రణాళికను తిరస్కరించిన ట్రంప్​

ఇరాన్ ప్రతిపాదించిన కాల్పుల విరమణ ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Trump Iran Ceasefire | పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించే ప్రక్రియను ప్రారంభించడానికి ఇరాన్ ప్రతిపాదించిన కాల్పుల విరమణ ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తిరస్కరించారు. టెహ్రాన్ ఎక్కువ రాయితీలను డిమాండ్ చేయడమే ఇందుకు కారణమని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి మైక్ వాల్ట్జ్ తెలిపారు.

చర్చలను పునఃప్రారంభించడానికి ముందే ఇరానియన్ ఓడరేవుల వద్ద అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని తొలగించడం, ఆంక్షల నుంచి ఉపశమనం వంటి చర్యలను డిమాండ్ చేశారని వాల్ట్జ్ చెప్పారు. టెహ్రాన్ తన హామీలకు కట్టుబడి ఉంటుందనే నమ్మకం ట్రంప్‌కు లేదన్నారు. దీంతో ఆయన కాల్పుల విరమణ ప్రణాళికను తిరస్కరించాలని చెప్పారు. ఇరాన్ నాయకులు తీవ్రంగా నష్టపోతున్నందునే ఈ ఒప్పందాన్ని కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.

Trump Iran Ceasefire | కీలక అంశాలు

ఐక్యరాజ్యసమితిలో ఇటీవల ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చి కాల్పుల విరమణ గురించి ప్రస్తావించారు. దీనిపై చర్చలు జరగాలంటే స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలని డిమాండ్​చేశారు. ఇరాన్ చమురుపై ఆంక్షలను ఎత్తివేయడంతో పాటు ‘హోర్ముజ్ జలసంధి’ తెరుచుకునేలా అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని ముగించడం వంటి అంశాలను ఆయన ప్రతిపాదించారు. వీటికి ట్రంప్​ ఒప్పుకోలేదు.

ఇది కూడా చదవండి..: Pakistan Suicide Bombing | పాక్​లో ఆత్మాహుతి దాడి..12 మంది దుర్మరణం..30 మందికి తీవ్ర గాయాలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *