అక్షరటుడే, వెబ్‌డెస్క్: Asia Games Cricket | ఆసియా క్రీడ (Asia Games)ల్లో భారత క్రికెట్ జట్టు సెమీస్‌కు చేరుకుంది. సోమవారం అఫ్గానిస్థాన్‌తో భారత్‌కు జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. డ్రా ప్రకారం డైరెక్ట్‌గా క్వార్టర్స్‌కు చేరుకున్న టీం ఇండియా తాజాగా సెమీస్‌కు దూసుకెళ్లింది.
జపాన్‌లోని నగోయాలో ప్రతికూల వాతావరణం కారణంగా భారత్, ఆఫ్ఘనిస్థాన్ పురుషుల క్రికెట్ మ్యాచ్ రద్దయింది. రోజంతా కురుస్తుండటంతో టాస్ కూడా పడలేదు. దీంతో చాలా సేపు వేచి చూసిన తర్వాత మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. అఫ్గానిస్థాన్ కంటే మెరుగైన ఐసీసీ ర్యాంకింగ్ కారణంగా భారత్ నేరుగా సెమీస్‌కు దూసుకెళ్లింది. అక్టోబర్1న సెమీఫైనల్‌లో శ్రీలంక లేదా నేపాల్‌తో భారత్ తలపడుతుంది.
Asia Games Cricket | పాక్ సైతం..
అంతకుముందు వర్షం కారణంతో పాకిస్థాన్, హాంగ్‌కాంగ్‌ల మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కూడా రద్దయింది, మెరుగైన ఐసీసీ టీ20ఐ ర్యాంకింగ్ ఆధారంగా పాకిస్థాన్ సెమీఫైనల్స్‌కు చేరుకుంది. దీంతో సెమీస్‌లో భారత్, పాక్ గెలిస్తే.. ఫైనల్లో తలపడే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి..: IND vs WI | భారత్ ఘన విజయం.. విండీస్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపు