అక్షరటుడే, వెబ్‌డెస్క్: Shakib Al Hasan | బంగ్లా క్రికెటర్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి జరిగింది. బుధవారం రాత్రి ఆయన ఇంటిపై దాడి చేసి దుండగులు ధ్వంసం చేశారు.భారత్ ఉంటున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina)తో కలిసి వర్చువల్ విలేకరుల సమావేశంలో షకీబ్ అల్ హసన్ పాల్గొన్నారు.
కొద్దిగంటల తర్వాత మాజీ క్రికెట్ కెప్టెన్, అవామీ లీగ్ మాజీ ఎంపీ షకీబ్ అల్ హసన్ పూర్వీకుల ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి జరిగింది. మగురా పట్టణంలోని కేశబ్‌మోర్ ప్రాంతంలో ఉన్న నివాసంపై ఈ దాడి జరిగింది. ఆ ఇంటిని ధ్వంసం కూడా చేశారు. ఢిల్లీలోని ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన వర్చువల్ పత్రికా సమావేశంలో షేక్ హసీనా ప్రసంగించిన కొద్ది సేపటికే ఈ ఘటన చేసుకోవడం గమనార్హం.
Shakib Al Hasan | మీడియా సంస్థలకు హెచ్చరికలు
బంగ్లాదేశ్‌ను నయా ఫాసిజం కమ్మేస్తోందని అవామీ లీగ్ ఒక ప్రకటనలో పేర్కొంది. షేక్ హసినాతో సమావేశంలో పాల్గొన్నందుకు బంగ్లా క్రికెటర్ ఇంటిపై దాడి చేశారని తెలిపింది. ఆ సమావేశం గురించిన వార్తలు ప్రసారమైతే కేసులు వేస్తామని BNP, ఇస్లామిస్ట్ జమాత్, NCPలు జాతీయ మీడియా సంస్థలను హెచ్చరించాయని అవామీ లీగ్ ఆరోపించింది. ప్రజాస్వామ్య స్థాపన పేరుతో అవామీ లీగ్ కార్యకర్తలపై సాగుతున్న మారణకాండకు, ఫాసిజం లక్షణాలకు ఈ దుర్మార్గపు దాడి మరో నిదర్శనం అని పేర్కొంది. కాగా వర్చువల్ విధానంలో మాట్లాడుతూ, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా అరెస్టునైనా లేదా మరణాన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని హసీనా తెలిపారాఉ. డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తానని చెప్పారు.
ఇది కూడా చదవండి..: Tanvi Sharma | తైపీ ఓపెన్.. చరిత్ర సృష్టించిన తన్విశర్మ