అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tanvi Sharma | తైపీ ఓపెన్ (Taipei open)లో భారత యువ క్రీడాకారిణి తన్వి శర్మ చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన తైపీ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో వియత్నాంకు చెందిన ఆరో సీడ్ థుయ్ లిన్ గుయెన్‌ను వరుస గేమ్‌లలో ఓడించి మహిళల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
పంజాబ్ (Punjab)కు చెందిన తన్వి శర్మ గత ఏడాది యూఎస్ ఓపెన్ సూపర్ 300లో రన్నరప్‌గా నిలిచింది. తాజాగా జరిగిన ఫైనల్ పోరులో గుయెన్‌ను 21-16 21-16 తేడాతో కేవలం 36 నిమిషాల్లోనే చిత్తు చేసింది. పీవీ సింధు మాజీ గురువు పార్క్ టే-సాంగ్ వద్ద తన్వి శిక్షణ తీసుకుంటోంది. మాజీ ప్రపంచ జూనియర్ నంబర్ 1 అయిన ఆమె ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్‌ల ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలు గెలిచిన తొలి భారతీయురాలిగా నిలిచింది.
Tanvi Sharma | అతిపిన్న వయస్కురాలి..
తన్వి 16 ఏళ్ల వయసులో 2025 యూఎస్ ఓపెన్‌లో తన తొలి సూపర్ 300 ఫైనల్‌కు చేరుకుంది. తాజాగా తైపీ ఓపెన్ టోర్నమెంట్ చరిత్రలోనే అతి పిన్న వయస్కురాలైన ఫైనలిస్ట్‌గా నిలిచింది. 2006లో పురుషుల డబుల్స్ ఫైనల్‌కు చేరినప్పుడు 17 సంవత్సరాల 287 రోజుల వయసున్న కొరియన్ డబుల్స్ దిగ్గజం లీ యాంగ్ డే రికార్డును ఆమె అధిగమించింది. తైపీ ఓపెన్ టైటిల్‌ను 2008లో సైనా నెహ్వాల్ (Saina Nehwal) గెలిచింది. 18 ఏళ్ల నిరీక్షణకు తాజాగా తన్వీ తెరదించింది.
TANVI SHARMA IS THE 2026 TAIPEI OPEN CHAMPION ❤️🏆#TaipeiOpen2026 https://t.co/NcR0gPVsot pic.twitter.com/hSKF3zeeod
— Badminton Media (@BadmintonMedia1) August 2, 2026
దీనిని కూడా చదవండి : Delimitation Bill | డీలిమిటేషన్ బిల్లుకు మద్దతిస్తే చరిత్ర ద్రోహులుగా మిగిలిపోతారు: రాహుల్ గాంధీ