Vaibhav Suryavanshi Selection | చిచ్చర పిడుగు వచ్చేశాడు.. భారత జట్టులోకి వైభవ్​

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Vaibhav Suryavanshi Selection | ఐపీఎల్​లో అదరగొట్టిన వైభవ్​ సూర్యవంశీ భారత జట్టులోకి ఎంపికయ్యాడు. ఈ సీజన్​లో రాజస్థాన్​ తరఫున ఆడిన ఈ బుడ్డోడు అత్యధిక పరుగులతో ఆరెంజ్​ క్యాప్​ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఐర్లాండ్​, ఇంగ్లాండ్​తో టీ 20 సిరీస్​ను బీసీసీఐ (BCCI) ప్రకటించింది. అందులో వైభవ్​ సూర్యవంశీకి చోటు దక్కింది.

ఐర్లాండ్​, ఇంగ్లాండ్​, ఆసియా గేమ్స్​ కోసం తాజాగా బీసీసీఐ జట్టును ప్రకటించింది. కెప్టెన్​గా శ్రేయాస్​ అయ్యార్​ను నియమించింది. వైభవ్ సూర్యవంశీకి తొలిసారిగా జట్టులో చోటు దక్కింది. తిలక్ వర్మ వైస్​ కెప్టెన్​గా ఎంపికయ్యాడు. కాగా వైభవ్​ చిన్న వయసులో భారత జట్టులోకి ఎంపిక కావడం గమనార్హం.

Vaibhav Suryavanshi Selection | సూర్యకుమార్​పై వేటు

కొంతకాలంగా టీ 20 జట్టు కెప్టెన్​గా కొనసాగుతున్న సూర్యకుమార్​ యాదవ్​ (Suryakumar Yadav)ను సెలెక్షన్​ కమిటీ పక్కన పెట్టింది. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడంతో పాటు జట్టు నుంచి కూడా తొలగించింది. కాగా సూర్యకుమార్​ కొంతకాలంగా ఫామ్​ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. టీ 20 ప్రపంచకప్​ (T20 World Cup) అందించనప్పటికీ వ్యక్తిగత ప్రదర్శన బాగా లేకపోవడంతో యాజమాన్యం అతడిని తప్పించి శ్రేయాస్​కు జట్టు పగ్గాలు అప్పగించింది.

Vaibhav Suryavanshi Selection | ఆసియా క్రీడలకు..

శ్రేయాస్ అయ్యర్ (C), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (wk), ఇషాన్ కిషన్ (wk), శివమ్ దూబే, తిలక్ వర్మ (vc), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్షదీప్​ సింగ్, వైభవ్ సూర్యవంశీ, జస్ప్రీత్ బుమ్రా.

Vaibhav Suryavanshi Selection | ఐర్లాండ్​, ఇంగ్లాండ్​​ టూర్​ కోసం..

vaibhav suryavanshi selection

శ్రేయాస్ అయ్యర్ (c), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (wk), ఇషాన్ కిషన్ (wk), శివమ్ దూబే, తిలక్ వర్మ (vc), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్​ యాదవ్, వైభవ్​ సూర్యవంశీ.

ఇది కూడా చదవండి..: Basketball Team | రాష్ట్రస్థాయి బాస్కెట్​బాల్ పోటీలకు జిల్లా జట్టు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *