India Men’s Kabaddi | కబడ్డీలో మరో స్వర్ణం.. సత్తా చాటిన పురుషుల జట్టు

ఆసియా క్రీడల్లో భారత పురుషుల జట్టు ఇరాన్​ను ఓడించి బంగారు పతకం సాధించింది.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: India Men’s Kabaddi | ఆసియా క్రీడల్లో భారత కబడ్డీ ప్లేయర్లు అదరగొట్టారు. ఉదయం జరిగిన మ్యాచ్​లో మహిళలు స్వర్ణం గెలుచుకోగా.. మధ్యాహ్నం జరిగిన ఫైనల్​ పోరులో పురుషుల జట్టు సైతం పసిడి పతకం సాధించారు.

ఆసియా గేమ్స్ (Asian Games)​లో ఇరాన్​తో శనివారం మధ్యాహ్నం జరిగిన ఉత్కంఠ పోరులో భారత పురుషుల జట్టు ఘన విజయం సాధించింది. ఆది నుంచి ఇరు జట్లు హోరోహోరీగా తలపడ్డాయి. ఫస్ట్​ హాప్​ ముగిసే సమయానికి భారత్‌పై ఇరాన్ 18-17తో ఆధిక్యంలో నిలిచింది. విజిల్‌కు కొద్ది క్షణాల ముందు, అమీర్‌మొహమ్మద్ జఫర్‌దనేష్ చేసిన విజయవంతమైన ట్యాకిల్ ఇరాన్‌కు ఒక పాయింట్‌ను అందించింది. విరామం అనంతరం భారత్ పుంజుకుంది. ఇరాన్​ను ఆలౌట్​ చేయడంతో మూడు బోనస్ పాయింట్లు సాధించి 29-24 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అనంతరం ఇరాన్‌ను 40-34 తేడాతో ఓడించి నాలుగో స్వర్ణ పతకాన్ని అందించడంతో పాటు తమ టైటిల్‌ను నిలబెట్టుకుంది.

India Men’s Kabaddi | నాలుగో సారి విజయం

గత నాలుగు ఆసియా క్రీడల ఫైనల్స్‌లో భారత్​, ఇరాన్​ మూడుసార్లు తలపడగా, ఆ మూడు మ్యాచ్‌లలోనూ భారతే విజయం సాధించింది. 2018 ఆసియా క్రీడల సెమీ-ఫైనల్‌లో ఇరాన్ చేతిలో భారత్​ ఓడిపోయింది. ఆ తర్వాత జరిగిన ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. తాజాగా మరోసారి ఇరాన్​పై ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత ఖాతాలో నాలుగు స్వర్ణాలు చేరాయి. ఇప్పటి వరకు భారత్ మొత్తం 28 పతకాలు సాధించింది.

ఇది కూడా చదవండి..: India Women Kabaddi | పసిడి పట్టు.. కబడ్డీలో భారత్​కు గోల్డ్​ మెడల్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *