అక్షరటుడే నిజామాబాద్ సిటీ : Godavari Pushkar Works | గోదావరి పుష్కర పనులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని కలెక్టర్ భవేష్ మిశ్రా (Collector Bhavesh Mishra) పేర్కొన్నారు. హైదరాబాద్ నుండి శనివారం రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంత రావులతో వీసీలో మాట్లాడారు.
ఇప్పటికే కందకుర్తి, యంచ వద్ద భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు వీలుగా పనులు ప్రారంభించామని కలెక్టర్ పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించిన దృష్ట్యా, పుష్కర ఘాట్ల వద్ద విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. పుష్కరాలకు గడువు సమీపిస్తున్నందున పనులను తక్షణమే చేపట్టి వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలోని కందకుర్తి పుష్కర క్షేత్రంతో పాటు బాసరకు ఆనుకుని అత్యంత చేరువలో ఉన్న యంచ వద్ద ఎండోమెంట్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ తదితర శాఖల ఆధ్వర్యంలో పనులు చేపట్టేందుకు వీలుగా శంకుస్థాపనలు పూర్తయ్యాయని తెలిపారు.
Godavari Pushkar Works | కందకుర్తి వద్ద గోదావరి ప్రవాహం..
కందకుర్తి వద్ద గోదావరిలో నీటి ప్రవాహం ఉన్నందున కొత్త పుష్కరఘాట్ నిర్మాణానికి మరికొంత సమయం పడుతుందని కలెక్టర్ అన్నారు. ఎస్సారెస్పీలో ప్రస్తుతం 46 టీఎంసీల వరకు నీరు నిలువ ఉందని, 20 నుండి 25 టీఎంసీలకు నీటి మట్టం చేరిన మీదట పుష్కర ఘాట్ పనులు చేపట్టేందుకు వీలుంటుందని తెలిపారు. మిగితా పనులను వెంటవెంటనే చేపట్టి, మైల్ స్టోన్ ప్రకారం పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నామని, మార్చి నెలాఖరు నాటికి అన్ని పనులు పూర్తయ్యేలా స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్తున్నామని అన్నారు.
కందకుర్తి, యంచతో పాటు జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతాలైన తుంగిని, పోచంపాడ్, తడ్ పాకల్ తదితర పుష్కర ప్రదేశాల వద్ద పుణ్య స్నానాలు ఆచరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులతో పాటు వీఐపీలు, వీవీఐపీలు తరలివచ్చే అవకాశాలు ఉన్నందున వాహనాల పార్కింగ్, సరైన రోడ్డు వసతి, అత్యవసర ఎగ్జిట్ వంటి అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు .వీడియో కాన్ఫరెన్స్లో ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, డీఆర్వో గీత, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఆర్డీవో సాయన్న, పంచాయతీరాజ్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Nyalkal Canal Death | న్యాల్కల్ కెనాల్లో పడి ఒకరి మృతి