అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Nyalkal Canal Death | ప్రమాదవశాత్తు కాలువలో పడి ఒకరు మృతి చెందిన ఘటన న్యాల్కల్ కాలువ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది.
Nyalkal Canal Death | స్నానానికి దిగి…
న్యాల్కల్ గ్రామానికి చెందిన భక్తుల దశరథ్ శుక్రవారం ఉదయం స్నానం చేయడం కోసం న్యాల్కల్ కాలువలోకి దిగాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మోపాల్ పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని రంగంలోకి దించారు. నిజామాబాద్ (Nizamabad)ఫైర్ స్టేషన్ ఆధ్వర్యంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం ఉదయం దశరథ్ మృతదేహాన్ని కెనాల్ నుండి వెలికి తీసి, పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్ (GGH)కు తరలించారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో జిల్లా ఫైర్ ఆఫీసర్ పరమేశ్వర్ ఆధ్వర్యంలో రూరల్ ఫైర్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ విక్రమ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్ క్యాప్టెన్/లీడింగ్ ఫైర్ ఫైటర్ యేసు రత్నం, ఫైర్ ఫైటర్ (టెక్నికల్ ఎక్స్-ఆర్మీ) సాయిరెడ్డి, ఎస్డీఆర్ఎఫ్ టీమ్ సభ్యులు జయంత్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Chakali Ailamma Tribute | బీసీల నిప్పుకణిక చాకలి ఐలమ్మ..