అక్షరటుడే వెబ్‌డెస్క్: Kavitha Khairatabad Bypoll | తెలంగాణ రాజకీయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఖైరతాబాద్ ఉప ఎన్నికల బరిలో తమ పార్టీ (తెలంగాణ రక్షణ సేన – TRS) అభ్యర్థిని నిలబెడుతున్నట్లు ఆ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన చేశారు. బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయించిన ప్రజాప్రతినిధులకు, వారిని ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఉప ఎన్నికల ద్వారా ప్రజలతో తగిన బుద్ధి చెప్పిస్తామని స్పష్టం చేశారు.
Kavitha Khairatabad Bypoll | ప్రభుత్వ వైఫల్యం..
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పాలన పూర్తిగా విఫలమైందని, ఇది ఒక ‘ఫెయిల్యూర్ సర్కార్’ అని కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పరిపాలన చేతకాకపోతే సీఎం పదవి నుంచి పక్కకు తప్పుకోవాలని సవాలు విసిరారు. రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలు పూర్తిగా అస్తవ్యస్తంగా మారాయని, వీటి పరిరక్షణ కోసం తమ పార్టీ తరఫున ప్రత్యక్ష యుద్ధం ప్రకటిస్తున్నామని ప్రకటించారు. ప్రభుత్వ ఆసుపత్రుల దుస్థితిపై ఆర్టీఐ డేటాను ప్రస్తావిస్తూ.. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఏటా వేలాది మంది పసిపిల్లలు మృత్యువాత పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
వైద్య రంగానికి 10 శాతం బడ్జెట్ ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 5 శాతమే కేటాయించిందని, ఆరోగ్యశ్రీ బకాయిలు కూడా పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపించారు. నిమ్స్, నీలోఫర్ ఆసుపత్రుల్లో రోగులకు కనీసం బెడ్లు కూడా దొరకని దయనీయ పరిస్థితి నెలకొందని విమర్శించారు.
Kavitha Khairatabad Bypoll | ఆరోపణలపై కవిత సవాలు..
తనపై వస్తున్న కబ్జా ఆరోపణలను కవిత తీవ్రంగా తిప్పికొట్టారు. తన ఫామ్‌హౌస్‌లో ఒక్క గజం కూడా కబ్జా భూమి లేదని, ఎలక్షన్ అఫిడవిట్‌లో చూపించిన దానికంటే రూపాయి ఎక్కువ ఉన్నా ఆ ఆస్తినంతా ప్రభుత్వానికే రాసిచ్చేస్తానని సవాలు విసిరారు. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఫోన్ ట్యాపింగ్, ఫామ్‌హౌస్‌ల విచారణ అంటూ సిట్ (SIT) డ్రామాలు ఆడుతోందని ఆరోపించారు.
ప్రతి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులను తమ పార్టీ నేతలు సందర్శిస్తారని, అధ్వాన పరిస్థితులను ఎండగడతామని చెప్పారు. మౌలిక వసతులు లేని ప్రభుత్వ పాఠశాలల్లో బాత్‌రూమ్‌ల నిర్మాణం కోసం తమ పార్టీ తరఫున విరాళాలు సేకరించి సాయం చేస్తామని తెలిపారు. సిరిసిల్ల పర్యటన, నేరేళ్ల బాధితులకు న్యాయం చేయడంలో ప్రభుత్వ వైఖరిని కూడా ఆమె తీవ్రంగా ప్రశ్నించారు.
కవిత షాకింగ్ డెసిషన్ ఖైరతాబాద్ బైపోల్లో పోటీ | Kavitha to Contest Khairatabad By-Poll | Mahaa News#kalvakuntlakavitha #khairatabadbypoll #byelectiosn #Danamnagender #mahaanewstelugu #mahaaanews pic.twitter.com/jD2C2erH41
— Mahaa News (@MahaaOfficial) September 26, 2026
ఇది కూడా చదవండి: Nyalkal Canal Death | న్యాల్కల్ కెనాల్లో పడి ఒకరి మృతి