అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Choutuppal Murder Case | యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. జోగినిగా పేరొందిన రాళ్లబండి సుధాకర్‌ను దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. అనంతరం ఆయన ఇంట్లోని 60 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు తీసుకొని పారిపోయారు.
చౌటుప్పల్ బీసీ కాలనీకి చెందిన సుధాకర్ (50) జోగినిగా పేరు పొందారు. ఆయనను పలువురు స్వామీజీగా కొలుస్తారు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఆయనను దుండగులు హత్య చేశారు. ఆయన కండ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి, కాళ్లు చేతులు కట్టేసి చంపేశారు. అనంతరం బీరువాను పగులకొట్టి 60 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. అనంతరం సుధాకర్‌కు చెందిన స్కార్పియో వాహనంలోనే అక్కడి నుంచి పరారు అయ్యారు.
Choutuppal Murder Case | పట్టించిన కారు
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. నిందితులు స్వామీజీ కారులో పరారు కావడంతో.. పోలీసులు ఆ కారులో ఉన్న జీపీ ఎస్ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. జీపీఎస్‌తో కారు వెళ్తున్న మార్గాన్ని ట్రాక్ చేసి, సిద్దిపేట సమీపంలో అరెస్ట్ చేసినట్లు సమాచారం. నిందితులను అస్సాంకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వారు కొంతకాలంగా సుధాకర్ దగ్గర శిష్యులుగా పని చేస్తున్నట్లు సమాచారం.
దీనిని కూడా చదవండి : illegal egg donation | అండాల మాఫియా.. 49 మంది యువతులకు విముక్తి!.. 10 మంది అరెస్టు