Drugs Case | డ్రగ్స్​ విక్రయిస్తూ దొరికిన ఐటీ ఉద్యోగి

మాదాపూర్​ ఇనార్బిట్​ మాల్​ సమీపంలో డ్రగ్స్​ విక్రయిస్తున్న ఐటీ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Drugs Case | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో డ్రగ్స్​ దందా జోరుగా సాగుతోంది. విద్యార్థులు, యువత మాదకద్రవ్యాలకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఐటీ ఉద్యోగులు సైతం డ్రగ్స్​ తీసుకుంటున్నారు. అంతేగాకుండా విక్రయాలు సైతం జరుపుతున్నారు.

Drugs Case | డ్రగ్స్​ విక్రయిస్తున్న ఐటీ ఉద్యోగి

మాదాపూర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఇనార్బిట్​ మాల్​ సమీపంలో డ్రగ్స్​ విక్రయిస్తున్న ఐటీ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్​ చేశారు. షేక్ అమ్నాహమద్‌ (23) అనే ఐటీ ఉద్యోగి విక్రయాలు జరుపుతున్నట్లు గుర్తించారు. సాఫ్ట్​వేర్​ ఉద్యోగులే లక్ష్యంగా అతడు అమ్మకాలు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి రూ.లక్ష విలువైన 7 గ్రాముల ఎండీఎంఏను, ఫోన్​ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరో ముగ్గురు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఎన్​డీపీఎస్​ చట్టం కింద నమోదు చేశారు. డ్రగ్ పెడ్లర్లు అమిర్, రాహీల్, వినియోగదారుడైన మధు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: HYDRAA Demolitions | ప్ర‌మాద‌క‌రంగా ఉన్న‌ భవనాలు తొల‌గిస్తాం : హైడ్రా క‌మిష‌న‌ర్‌

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *