HYDRAA Action | కోనేరు ఆక్రమణలను తొలగించిన హైడ్రా

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA Action | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేస్తున్నారు. చెరువులు, పార్కులు, రోడ్లను ఆక్రమిస్తున్నారు. చివరకు ఆలయ భూములను వదలడం లేదు. అయితే ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది.

నగరంలోని జగద్గిరిగుట్ట (Jagadgirigutta)లోని కోనేరు(గుండం) కబ్జాకు గురవుతోందని గోవిందరాజుల స్వామి ఆలయ పూజారి నరహరి గతంలో రోదించారు. ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. దీంతో హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ గతంలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కోనేరును పరిరక్షిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం కోనేరు స్థలంలో ఆక్రమణలను హైడ్రా సిబ్బంది తొలగించారు. అనంతరం అందులో పేరుకుపోయిన పూడిక తీయించారు. దాదాపు 26 ట్రక్కుల వరకూ ఉన్న నిర్మాణ వ్యర్థాలు, చెత్త, చెదారాన్ని తొలగించి కోనేరుకు కొత్త కళను తెచ్చారు.

HYDRAA Action | పార్కింగ్​ కోసం..

ఒక ఎకరా వరకూ ఉన్న కోనేరును కొందరు ఆక్రమించారు. మట్టితో నింపి.. పార్కింగ్ కోసం వినియోగించుకుంటున్నారు. ఇలా మొత్తం కోనేరునే కబ్జా చేయాలని ప్రయత్నించారు. అయితే హైడ్రా వారి ఆట కట్టించింది. కోనేరు పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టింది. దీంతో స్థానికులతో పాటు.. ఆలయ భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఆలయ పూజారి నరహరి మాట్లాడుతూ.. 22 ఏళ్ల పోరాటం ఫలించిందన్నారు. హైడ్రా రూపంలో ఆ భగవంతుడే కోనేరు పరిరక్షణకు చర్యలు తీసుకున్నారన్నారు.

koneru

దీనిని కూడా చదవండి : Defence Liquor Seizure | రూ.10 లక్షల విలువైన డిఫెన్స్ మద్యం పట్టివేత

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *