అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad Couple Missing | స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్లిన హైదరాబాద్ (Hyderabad) దంపతులు అదృశ్యం అయ్యారు. దీంతో వారి కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నగరంలోని కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చక్రపురం, భగవాన్ కాలనీకి చెందిన పబ్బ చంద్రశేఖర్ శ్రీవెంకటేశ్వర మార్కెటింగ్ పేరుతో సిమెంట్ వ్యాపారం చేసేవాడు. ఆయన తన భార్య స్వప్నతో కలిసి జూన్ 22న స్విట్జర్లాండ్ వెళ్లాడు. అనంతరం కొద్ది రోజుల పాటు కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. తర్వాత ఇద్దరి ఫోన్లు స్విచ్ఆఫ్ వస్తున్నాయి. వారు ఎక్కడ ఉన్నారో కూడా సమాచారం లేదు. దీంతో వారి కూతురు పబ్బా శ్రేయ చర్లపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad Couple Missing | రూ.50 కోట్లతో పరారు..
పబ్బా చంద్రశేఖర్ 30 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నాడు. దీంతో స్థానికంగా చాలా మందితో పరిచయాలు ఉన్నాయి. ఈ క్రమంలో వారి నుంచి రూ.50 కోట్లు అప్పుగా తీసుకొని పారిపోయాడు. ఈ మేరకు ఇదివరకే బాధితులు మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తాజాగా తమ తల్లిదండ్రులు అదృశ్యం అయ్యారని చంద్రశేఖర్ కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. వారు నిజంగానే అదృశ్యం అయ్యారా.. లేక అప్పులు తీసుకున్న వారిని మాయ చేయడానికి ఇలా చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి..: Hyderabad Police Transfers | భారీగా పోలీస్ ఇన్‌స్పెక్టర్ల బదిలీలు..30 మందికి స్థానచలనం