అక్షరటుడే వెబ్‌డెస్క: Hyderabad SI transfers | హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, పరిపాలనా సౌలభ్యం కోసం ఎస్సైల (SIs) బదిలీల ప్రక్రియ ఊపందుకుంది.
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ నుంచి తాజాగా వెలువడిన ఉత్తర్వుల ప్రకారం.. సైబరాబాద్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న 32 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లను జోన్-VI చార్మినార్‌కు సరెండర్ చేయాలని ప్రతిపాదించారు.
Hyderabad SI transfers | జోన్ల వారీగా వివరాలు:
కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, షేరిలింగంపల్లి డివిజన్ల నుంచి మొత్తం 32 మంది ఎస్సైలను బదిలీ చేస్తున్నారు. ఇందులో కూకట్‌పల్లి జోన్ నుంచి 10 మంది, కుత్బుల్లాపూర్ జోన్ నుంచి 12 మంది, షేరిలింగంపల్లి (గచ్చిబౌలి, నార్సింగి, చందానగర్ తదితర ప్రాంతాలు) జోన్ నుంచి 10 మంది ఎస్సైలు ఉన్నారు.
సైబరాబాద్ నుంచి చార్మినార్ జోన్‌కు పంపిస్తున్న ఎస్సైల స్థానంలో, హైదరాబాద్ సిటీలో పనిచేస్తున్న మరో 32 మంది ఎస్సైలను సైబరాబాద్‌కు కేటాయించాలని సీపీ ప్రతిపాదించారు. దీనికి సంబంధించి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‌తో చర్చించి ప్రాథమిక అంగీకారం పొందినట్లు సమాచారం.
Hyderabad SI transfers | బదిలీ అయిన ప్రముఖులు:
గచ్చిబౌలి, రాయదుర్గం, మాదాపూర్, మియాపూర్, కూకట్‌పల్లి, కెపీహెచ్‌బీ వంటి కీలక పోలీస్ స్టేషన్ల నుంచి 2012, 2014, 2020 బ్యాచ్‌లకు చెందిన ఎస్సైలు ఈ జాబితాలో ఉన్నారు.
హైదరాబాద్ సిటీ నుంచి సైబరాబాద్‌కు రావడానికి ఆసక్తి చూపుతున్న ఎస్సైల సేవలను ఇక్కడ వినియోగించుకోవడంతో పాటు, సిబ్బంది సర్దుబాటులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు.
ఈ మేరకు తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్, హైదరాబాద్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (జోన్-VI చార్మినార్) కు లేఖ రాశారు. ఈ బదిలీల ప్రక్రియ త్వరలోనే పూర్తి కానుంది.



Mamata | ఫలితాలు రాక ముందే సీఎం నివాసం ఖాళీ చేసిన మమతా బెనర్జీ!

