Tumakuru family tragedy | పరాయి వ్యక్తి మోజులో భార్య పరారీ.. ఇద్దరు బిడ్డలను చంపి, తండ్రి ఆత్మహత్య!

Naresh Chandan
Tumakuru family tragedy

అక్షరటుడే వెబ్‌డెస్క: Tumakuru family tragedy | కట్టుకున్న భార్య మోసానికి మరో పచ్చని సంసారం ఛిన్నాభిన్నమైంది. పరాయి వ్యక్తితో భార్య పారిపోవడాన్ని తట్టుకోలేక, కన్నబిడ్డలను చంపిన ఓ తండ్రి తాను కూడా తనువు చాలించిన హృదయ విదారక ఘటన కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో వెలుగుచూసింది.

Tumakuru family tragedy | వివరాల్లోకి వెళ్తే..

తుమకూరు tumakuru జిల్లా కుణిగల్ తాలూకా ఆల్కెరె గ్రామానికి చెందిన శివణ్ణ, అదే ఊరిలోని మల్లేశ్వరస్వామి ఆలయంలో పూజారిగా చేసేవాడు. భక్తిశ్రద్ధలతో ఆలయ బాధ్యతలు నిర్వహిస్తూనే, మరోవైపు కుటుంబాన్ని పోషించుకోవడానికి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. భార్య కావ్య, ఇద్దరు కుమారులతో శివణ్ణ జీవితం హాయిగా సాగిపోతున్న తరుణంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది.

Tumakuru family tragedy | రెండుసార్లు పరారీ

కాగా, వారం రోజుల క్రితం కావ్య మరో వ్యక్తితో కలిసి ఇంటి నుంచి పారిపోయింది. భార్య కనిపించడం లేదని శివణ్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొద్ది రోజుల తర్వాత ఆమె తిరిగి రావడంతో గొడవ సద్దుమణిగిందని అందరూ భావించారు. అయితే, అసలు కథ మరుసటి రోజే స్టార్ట్​ అయింది. శివణ్ణ పనిమీద బయటకు వెళ్లిన సమయంలో, కావ్య ఇంట్లో ఉన్న రూ.లక్షల నగదు, బంగారు ఆభరణాలతో సహా అదే యువకుడితో మళ్లీ పారిపోయింది.

Tumakuru family tragedy | మనస్తాపంతో అఘాయిత్యం

కట్టుకున్న భార్య.. తన కడుపున పుట్టిన పిల్లలను వదిలి, డబ్బుతో పారిపోవడంతో శివణ్ణ తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. సమాజంలో తలెత్తుకోలేక తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడు. తన ఇద్దరు కుమారులకు ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీశాడు. అనంతరం తాను ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఒకే కుటుంబంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో ఆల్కెరె గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన కావ్య కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Mamata | ఫలితాలు రాక ముందే సీఎం నివాసం ఖాళీ చేసిన మమతా బెనర్జీ!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *