Ram Mandir Donations | అయోధ్య రామ మందిరం విరాళాల చోరీపై ఎస్పీ ఎంపీల నిరసన

అయోధ్య రామ మందిరంలో విరాళాల చోరీపై సమాజ్​వాది పార్టీ ఎంపీలు నిరసన తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ram Mandir Donations | అయోధ్య రామ మందిరంలో విరాళాల చోరీపై సమాజ్​వాది పార్టీ ఎంపీలు నిరసన తెలిపారు. పార్లమెంట్​ ఆవరణలో బుధవారం ఉదయం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అయోధ్య రామ మందిరం విరాళాల చోరీపై ఇప్పటికే కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే రామ మందిర విరాళాల దుర్వినియోగం కేసుపై ప్లకార్డులు పట్టుకుని, ‘చందా చోర్ గడ్డి ఛోడ్’ (డబ్బు దొంగ, గద్దెను వదిలేయండి) అనే నినాదాలు చేస్తూ ఎస్పీ ఎంపీలు నిరసన తెలిపారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) మాట్లాడుతూ.. విరాళాలను కాపాడటంలో విఫలమై, భక్తిశ్రద్ధలతో సమర్పించిన కానుకలను రక్షించలేని వారు, పేపర్ లీక్‌లను నివారిస్తారని లేదా పరీక్షలు రద్దు కాకుండా చూస్తారని ఎలా ఆశించగలం అన్నారు. విశ్వాసంతో చెలగాటం ఆడగల వారు, మన యువత భవిష్యత్తుతో కూడా చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు.

Ram Mandir Donations | బీజేపీ వాళ్లు కాజేశారు

సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ మాట్లాడుతూ ప్రజలు తమ విశ్వాసం, భక్తితో ఆలయానికి వచ్చి శ్రీరాముని పాదాల చెంత విరాళాలు సమర్పించారన్నారు. కానీ బీజేపీ వాళ్లు, వారి అనుచరులు ఈ విరాళాలను కూడా కాజేశారని ఆరోపించారు. ఈ కుంభకోణం ఎలా జరిగిందో వివరించాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉందన్నారు. ప్రజల దృష్టిని మళ్లించి, ఇలాంటి సమస్యలు మరుగున పడిపోయేలా చేయడానికి నామమాత్రంగా సిట్ ఏర్పాటు చేశారని విమర్శించారు.

ఇది కూడా చదవండి..: Minimum Balance Charges | ‘మినిమం బ్యాలెన్స్’ చార్జీ .. రూ. 7 వేల కోట్లు!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *