ITR Filing | ఐటీఆర్ దాఖలుకు మిగిలింది మరో వారమే.. నిర్లక్ష్యం చేస్తే జరిమానా తప్పదు

ఇన్​కం ట్యాక్స్ రిటర్న్స్ సమర్పించడానికి తుది గడువు సమీపిస్తోంది. ఈనెల 31వ తేదీలోగా ఐటీఆర్ పైల్ చేయాల్సి ఉంటుంది.

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: ITR Filing | పన్ను మదింపు సంవత్సరం 2026-27కు సంబంధించి ఇన్​కం ట్యాక్స్ రిటర్న్స్ (Income Tax Returns) సమర్పించడానికి తుది గడువు సమీపిస్తోంది. ఈనెల 31వ తేదీలోగా ఐటీఆర్ పైల్ చేయాల్సి ఉంటుంది. చివరి నిమిషంలో అందరూ ఒకేసారి దాఖలు చేస్తే సర్వర్ సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయి.

గడువు ముగిసిన తర్వాత ఫైల్ చేసినా, ఆదాయాన్ని దాచిపెట్టినా పెనాల్టీలు తప్పవు. గడువులోగా ఐటీఆర్ దాఖలు చేస్తే పన్ను రీఫండ్ వేగంగా ప్రాసెస్ అవ్వడంతోపాటు భవిష్యత్తులో రుణాలు పొందడానికి, వీసా ప్రక్రియలకు ఎలాంటి అడ్డంకులు ఎదురుకావు. నిబంధనల ఉల్లంఘనలకు ఎలాంటి జరిమానాలు ఉంటాయో తెలుసుకుందామా..

ITR Filing | గడువు దాటితే..

ఐటీఆర్ దాఖలు చేయడానికి ఈనెలాఖరు వరకు గడువుంది. ఒకవేళ నిర్దేశిత గడువు దాటిన తర్వాత ఐటీఆర్ ఫైల్ చేస్తే జరిమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ మొత్తం వార్షిక ఆదాయం రూ. 5 లక్షల కంటే తక్కువ ఉంటే వెయ్యి రూపాయలు, ఎక్కువ ఉంటే రూ. 5 వేల జరిమానా విధిస్తారు.

ITR Filing | ఆదాయం వివరాలు దాచిపెడితే..

పన్నుపోటును తగ్గించుకోవడానికి ఆదాయాన్ని తక్కువగా చూపించడాన్ని ఆదాయపన్ను శాఖ సీరియస్‌గా తీసుకుంటుంది. ఇలా చేస్తే చెల్లించాల్సిన పన్నుపై 50 శాతం నుంచి 200 శాతం వరకు జరిమానా విధించడానికి ఆస్కారం ఉంటుంది.

ITR Filing | సవరించిన రిటర్న్స్ సమర్పణ ఆలస్యమైతే..

మొదట దాఖలు చేసిన ఐటీఆర్‌లో ఏవైనా పొరపాట్లు దొర్లితే వాటిని సరి చేసి, సవరించిన రిటర్న్స్ ఇవ్వడంలో కూడా జాప్యం జరిగితే ఇన్కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ జరిమానా విధిస్తుంది. ఇది వెయ్యి రూపాయలనుంచి రూ. 5 వేల వరకు ఉండొచ్చు.

సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ కట్టకపోతే..

ఐటీఆర్ రిటర్న్స్ సమర్పించే ముందు మిగిలి ఉన్న పన్ను బాధ్యతను చెల్లించడంలో విఫలమైతే.. బాకీ ఉన్న పన్ను మొత్తానికి సమానమైన జరిమానా విధించే అవకాశాలుంటాయి.

ఎక్కువ నగదును స్వీకరిస్తే..

చట్టపరమైన పరిమితిని మించి, ఒకేరోజు రూ. 2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదును స్వీకరించడమమనేది నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుంది. దీనికి జరిమానా విధిస్తారు.

ఇది కూడా చదవండి..: Paper Leak Punishment | పేపర్ లీక్​కు పాల్పడితే పదేళ్ల జైలు.. కేంద్రం కీలక నిర్ణయం !

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *