Paper Leak Punishment | పేపర్ లీక్​కు పాల్పడితే పదేళ్ల జైలు.. కేంద్రం కీలక నిర్ణయం !

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Paper Leak Punishment | నీట్ పేపర్​ లీకేజీ అంశంపై విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న చట్టాలను మరింత కఠినతరం చేయాలని నిర్ణయించింది.

పేపర్​ లీకేజీ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ (PM Modi) గురువారం రాత్రి వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం జరగనున్న కేబినెట్​ సమావేశంలో దీనిపై చర్చించి ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. పేపర్ లీక్ కేసుల విచారణ కోసం ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసే నిబంధనను చట్టంలో చేర్చవచ్చని, అలాగే లీక్​కు పాల్పడే నిందితులకు 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.కోటి జరిమానా విధించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

Paper Leak Punishment | ప్రస్తుత శిక్షలు

ప్రస్తుతం పేపర్ లీక్ కేసులో దోషిగా తేలిన వ్యక్తులకు 3 నుండి 5 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 10 లక్షల వరకు జరిమానా విధిస్తున్నారు. చట్టంలో సవరణ చేసి జరిమానాను రూ. 1 కోటి వరకు పెంచాలని కేంద్రం భావిస్తోంది. జైలు శిక్షను సైతం పదేళ్ల వరకు విధించాలని యోచిస్తోంది. కేబినెట్ ఆమోదం తర్వాత, ఈ సవరణ బిల్లును సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పేపర్ లీక్ కేసులలో శుక్రవారం మరిన్ని చర్యలు తీసుకుంటామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో ప్రకటనలో హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి..: NEET Student Protests | ప్రధాని మోదీ మన్ కీ బాత్ మానుకోవాలి: మల్లికార్జున ఖర్గే

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *