అక్షరటుడే వెబ్‌డెస్క్: Mamata Banerjee Notice | తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ కకోలీ ఘోష్ కుమారుడు డాక్టర్ బైద్యనాథ్ ఘోష్, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ( Mamata Banerjee ) లీగల్ నోటీసులు పంపారు. వీరితో పాటు పార్టీ నేతలు కల్యాణ్ బెనర్జీ, సౌగతా రాయ్, మహువా మోయిత్రాలకు కూడా నోటీసులు అందజేశారు.
Mamata Banerjee Notice | నోటీసులకు కారణం ..
ఇటీవల జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ, బరసత్ అసెంబ్లీ టికెట్ కోసం కొంతమంది తనను సంప్రదించారని, అయితే పార్టీ సీనియర్ల అభ్యంతరాల మేరకు వారి అభ్యర్థనను తిరస్కరించానని వ్యాఖ్యానించారు. అంతేకాదు, “ఒకరు ఎంపీ అయినంత మాత్రాన కుటుంబంలోని వారందరూ ఎంపీలు, ఎమ్మెల్యేలు కావాలా?” అంటూ ఆమె పరోక్షంగా కకోలీ ఘోష్‌ను ఉద్దేశించి విమర్శలు చేశారు. తమ కుటుంబ ప్రతిష్టను దెబ్బతీసేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని, దీనిపై బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని బైద్యనాథ్ ఘోష్ డిమాండ్ చేశారు. ఒకవేళ స్పందించకపోతే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. టికెట్ కోసమే తాము ఎన్డీఏకు మద్దతు ఇచ్చామన్న ఆరోపణలను ఆయన పూర్తిగా ఖండించారు.

Mamata Banerjee Notice |టీఎంసీలో అంతర్గత మార్పులు..
పార్టీ నుంచి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు బయటకు వెళ్తుండటంతో టీఎంసీలో అలజడి మొదలైంది. ఈ నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసేందుకు మమతా బెనర్జీ సంస్థాగత మార్పులు చేపట్టారు. సయోని ఘోష్ ఎన్డీఏకు మద్దతు ఇవ్వడంతో, ఆమె స్థానంలో అర్నబ్ బెనర్జీని టీఎంసీ యువజన విభాగం అధ్యక్షుడిగా నియమించారు. తృణమూల్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న మాలా రాయ్ స్థానంలో, ఎమ్మెల్యే అలీఫా అహ్మద్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. పార్టీని ప్రక్షాళన చేసే ఉద్దేశంతోనే ఈ మార్పులు చేసినట్లు టీఎంసీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, తాజా లీగల్ నోటీసుల వ్యవహారం ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
ఇది కూడా చదవండి: School Bus Fitness | ఫిట్నెస్ లేకపోతే కఠిన చర్యలు.. స్కూల్ బస్సులపై అధికారుల ఫోకస్