Morena Train Accident | ప్రాణం తీసిన వదంతులు.. రైలు ఢీకొని నలుగురి మృతి

మధ్యప్రదేశ్‌లోని మొరేనా జిల్లాలో రైలు ఢీకొని నలుగురు మృతి చెందారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Morena Train Accident | మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని మొరేనా జిల్లాలో ఆదివారం ఒక విషాదకరమైన రైలు ప్రమాదం జరిగింది. ఖజురహో-ఉదయపూర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయన్న వదంతులు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు చైన్​ లాగి కిందకు దూకారు.

వదంతులు ప్రయాణికుల ప్రాణాలు తీశాయి. రైలులో మంటలు చెలరేగాయని భయంతో కిందకు దూకేయగా.. అదే సమయంలో వచ్చిన మరో రైలు వారిని ఢీకొంది. ప్రయాణికులు కిందకు దిగిన తర్వాత పక్కన ఉన్న మరో ట్రాక్​పై గుమి గూడారు. ఆ మార్గంలో వచ్చిన పాతాళ్‌కోట్ ఎక్స్‌ప్రెస్‌ వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మోరేనాలోని హేతంపూర్ స్టేషన్ సమీపంలో జరిగింది.

Morena Train Accident | సహాయక చర్యలు

ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు, రైల్వే పరిపాలన అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇప్పటివరకు ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. మరణించిన వారిని అఫ్రీన్ (ఆగ్రా), ఆమె నాలుగేళ్ల కుమారుడు అసద్ ఖాన్, శకుంతల (ఆగ్రా), విర్మా దేవి (రాజస్థాన్​)గా గుర్తించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపడుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

 

దీనిని కూడా చదవండి :  Mamata Banerjee Notice | మమతా బెనర్జీకి లీగల్ నోటీసు.. పరువు నష్టం దావా హెచ్చరిక!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *