Indian Navy DSC A24 | భారత నౌకాదళంలోకి ‘DSC A24’ డైవింగ్ సపోర్ట్ క్రాఫ్ట్

భారత నౌకాదళం (Indian Navy) స్వదేశీ రక్షణ రంగంలో మరో మైలురాయిని సాధించింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Indian Navy DSC A24 | భారత నౌకాదళం (Indian Navy) స్వదేశీ రక్షణ రంగంలో మరో మైలురాయిని సాధించింది. ఇందులో భాగంగా ఐదో డైవింగ్ సపోర్ట్ క్రాఫ్ట్ ‘DSC A24’ నౌకను ఆగస్టు 1న విజయవంతంగా జలప్రవేశం చేశారు. కోల్‌కతాలోని ప్రముఖ నావికా నిర్మాణ సంస్థ ‘టిటాగఢ్ రైల్ సిస్టమ్స్ లిమిటెడ్’ (TRSL) ప్రాంగణంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. నేవీ చీఫ్ ఆఫ్ పర్సనల్ వైస్ అడ్మిరల్ గుర్చరణ్ సింగ్ సమక్షంలో శ్రీమతి కమల్ సింగ్ చేతుల మీదుగా ఈ నౌకను అధికారికంగా ప్రారంభించారు.

Indian Navy DSC A24 | ప్రత్యేకతలు ఇవే..

ఈ డీఎస్‌సీ (DSC) సిరీస్ నౌకలను ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్ (IRS) నిబంధనల ప్రకారం టిటాగఢ్ రైల్ సిస్టమ్స్ నిర్మిస్తోంది. వినూత్నమైన కేటామారన్-హల్ (Catamaran-Hull) నమూనాలో డిజైన్ చేసిన ఈ నౌక సుమారు 300 నుంచి 400 టన్నుల నీటి స్థానభ్రంశం (Displacement) కలిగి ఉంటుంది. శత్రువుల కదలికలను పసిగట్టడంతో పాటు, నౌకాదళం చేపట్టే క్లిష్టమైన డైవింగ్ ఆపరేషన్లను సమర్థవంతంగా నిర్వహించడానికి అత్యాధునిక సాంకేతిక పరికరాలతో దీనిని ప్రత్యేకంగా రూపొందించినట్లు నౌకాదళ ప్రతినిధి తెలిపారు.

ఇది కూడా చదవండి:  Ayodhya Bomb Note | మెడికల్ కాలేజీలో బాంబు తయారీ నోట్‌ లభ్యం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *