అక్షరటుడే, వెబ్‌డెస్క్ : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని హైదరాబాద్ (Hyderabad)లోని ఇందిరా పార్క్ వద్ద విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు. వారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంఘీభావం తెలిపారు.
కేటీఆర్ శుక్రవారం మధ్యాహ్నం ధర్నా చౌక్‌కు చేరుకున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ యువతతో కలిసి కేటీఆర్ నిరసన తెలిపారు. కేటీఆర్ రావడంతో యువత పెద్ద ఎత్తున ఆందోళనలో పాల్గొనడానికి వచ్చారు. తన పుట్టినరోజు వేడుకలు రద్దు చేసుకుని యువతకు సంఘీభావంగా ఆయన ధర్నాకు వచ్చారు. విద్యార్థులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.
KTR Student Protest | కాంగ్రెస్ నేతల ఆందోళన
కేటీఆర్ నిరసన నేపథ్యంలో హైదరాబాద్‌లో యూత్ కాంగ్రెస్ నాయకులు ఆందోళన నిర్వహించారు. బీఆర్ఎస్ హయాంలో పేపర్ లీకేజీలకు కేటీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి వారు ధర్నా చౌక్‌కు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో యూత్ కాంగ్రెస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వారు మాట్లాడుతూ.. గతంలో తెలంగాణలో ఇంటర్ ప్రశ్నాపత్రం లీక్ అయిందన్నారు. కేటీఆర్ బినామీ సంస్థ అయిన గ్లోబరీనా కంపెనీ దీనికి కారణం అని ఆరోపించారు. 2019 ఇంటర్ ఫలితాల అవకతవకల వల్ల 27 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. ఈ ఘటనకు కేటీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి..: Indiramma Towers | ఇళ్ల కేటాయింపులో బలహీన వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు : మంత్రి పొంగులేటి