అక్షరటుడే, వెబ్‌డెస్క్: Khammam Attempted Rape Victim | నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఖమ్మం అత్యాచారయత్నం బాధిత బాలికను శనివారం తెరాస అధినేత్రి K. Kavitha పరామర్శించారు. వైద్యులను అడిగి బాధితురాలి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ఆమె, కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.
Khammam Attempted Rape Victim | సమాజానికి బలమైన సందేశం ఇవ్వాలి
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. బాధితురాలిపై జరిగిన ఘటన అత్యంత అమానుషమైనదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిపై కఠినమైన చట్టాలు ప్రయోగించి, వీలైనంత త్వరగా శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘోర నేరాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించడం ద్వారా సమాజానికి బలమైన సందేశం ఇవ్వాలని పేర్కొన్నారు.
Khammam Attempted Rape Victim | ప్రభుత్వం విఫలం..
రాష్ట్రంలో మహిళలు, బాలికల భద్రతపై ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని కవిత అన్నారు. మైనర్లపై వరుసగా అఘాయిత్యాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోందని విమర్శించారు. హోంమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి మహిళలు, బాలికల భద్రతపై ప్రత్యేక సమీక్ష నిర్వహించి, రాష్ట్ర ప్రజల్లో భరోసా కల్పించాలని కోరారు.
Khammam Attempted Rape Victim | అండగా నిలవాలి
బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలవాలని కవిత విజ్ఞప్తి చేశారు. కుటుంబానికి గృహ వసతి కల్పించడంతో పాటు, ప్రతి నెల ఆర్థిక సహాయం లేదా పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. మహిళలపై నేరాల నియంత్రణకు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.
Anganwadi Reappointment | అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు గుడ్న్యూస్.. వారికి మళ్లీ ఉద్యోగం