Youth Sports Festival | నేటి నుంచి క్రీడా – యువజన వారోత్సవాలు

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Youth Sports Festival | ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 18 నుంచి 23 వరకు రాష్ట్ర వ్యాప్తంగా యువజన – క్రీడా వారోత్సవాలు జరగనున్నాయి.

ఈమేరకు నేడు (సోమవారం, మే 18) ఉదయం 6 గంటలకు ఎల్బీ స్టేడియం టెన్నిస్ కాంప్లెక్స్ లో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి బీసీ – రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనారెడ్డి, క్రీడల సలహాదారులు ఏపీ జితేందర్ రెడ్డి, ప్రభుత్ ముఖ్య కార్యదర్శి జయష్ రంజన్ కలిసి ప్రారంభిస్తారు.

Youth Sports Festival | ఐదు కిలోమీటర్ల వాక్ థాన్

ఉదయం టెన్నిస్ కాంప్లెక్స్ లో ఉదయం 6 గంటలకు మెగా జుంబా కార్యక్రమం ఆ తదుపరి ఐదు కిలోమీటర్ల వాక్ థాన్, ఎల్బీ ఇండోర్ స్టేడియంలో జరిగే యోగా, మెడిటేషన్ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొంటారు.

ఎల్​బీ టెన్నిస్ కాంప్లెక్స్ వద్ద మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్​ జెండా ఊపి వాకథాన్ ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో సుమారు 2000 పైగా యువ క్రీడాకారులు పాల్గొంటారని అంచనా.

Youth Sports Festival | యోగా, మెడిటేషన్..

ఈ 5k వాక్​థాన్​ కార్యక్రమం ఎల్బీ స్టేడియం, బషీర్బాగ్ ప్రెస్ క్లబ్, ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం, బురుగుల రామకృష్ణారావు భవనం, ఈగల్ సర్కిల్, ఆర్బీఐ, అసెంబ్లీ కంట్రోల్ రూమ్ మీదుగా ఎల్బీ ఇండోర్ స్టేడియం వరకు కొనసాగుతుంది. తదుపరి ఎల్బీ ఇండోర్ స్టేడియంలో దివ్యాంగులకు, మహిళలకు సీనియర్ సిటిజన్స్ కు యోగా, మెడిటేషన్ ఉంటుంది.

Gurukula Funds Release | ‘భవన అద్దె’ ‘డైట్’, ‘కాస్మెటిక్స్’ నిధుల…

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *