HYDRAA | 6 వేల గజాల పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా

కీసర మండలం కుందన్‌పల్లి గ్రామ పరిధిలో 7,200 స్థలాన్ని హైడ్రా కాపాడింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA | మేడ్చ‌ల్ – మ‌ల్కాజిగిరి జిల్లా కీసర (Keesara) మండలం కుందన్‌పల్లి గ్రామ పరిధిలో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. టీపీఎస్‌ చాముండిపట్నం కాలనీలో 7,200 గ‌జాల భూమిని మంగ‌ళ‌వారం కాపాడింది.

గ్రామంలో 1983లో వేసిన ఈ లే ఔట్‌లో పార్కు కోసం 6 వేల గ‌జాల స్థ‌లాన్ని వదిలేశారు. అలాగే మార్కెట్​ కోసం రెండు ప్రాంతాల్లో 600 గ‌జాల చొప్పున కేటాయించారు. ప్రజావసరాల కోసం వదిలేసిన మొత్తం 7200 గజాల స్థలంపై కొందరి కన్ను పడింది. దానికి కబ్జా చేసేందుకు ప్ర‌య‌త్నించారు. అంతేగాకుండా ప్రీకాస్ట్ వాల్స్ నిర్మించి భూమిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మొత్తం 7,200 గజాల స్థలాన్ని ప్లాట్లుగా మార్చేశారు. ఈ విషయాన్ని కాల‌నీ క‌ల్చ‌ర‌ల్ అండ్ వెల్ఫేర్ అసోసియేష‌న్ ప్ర‌తినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆక్రమణలు నిజమేనని నిర్ధారించుకొని మంగ‌ళ‌వారం ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించింది.

HYDRAA | చెరువు ఆక్రమణకు యత్నం

ప‌టాన్‌చెరు (Patancheru)లోని సాకి చెరువును కొందరు కబ్జా చేశారు. లారీల‌తో మ‌ట్టి పోసి ఆక్రమిస్తున్నారు. 100 ఎక‌రాల‌కు పైగా ఉన్న ఈ చెరువును కాపాడాలని ఇరిగేషన్​ అధికారులు హైడ్రాను కోరారు. దీంతో వారి విజ్ఞ‌ప్తి మేర‌కు హైడ్రా మంగ‌ళ‌వారం కిలోమీట‌రు మేర ఫెన్సింగ్ వేసి.. చెరువులో మ‌ట్టి పోయ‌డానికి వీలు లేకుండా చేసింది.

దీనిని కూడా చదవండి : Indiramma Houses | ఏడాదిలోపే ఇందిరమ్మ ఇళ్లు అందిస్తాం : మంత్రి పొంగులేటి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *