TGSPDCL power demand | తెలంగాణలో విద్యుత్‌ డిమాండ్‌ దూకుడు.. TGSPDCL చరిత్రలో సరికొత్త రికార్డు

12 వేల మెగావాట్ల కీలక మార్కును దాటడం తెలంగాణలో పెరుగుతున్న విద్యుత్‌ అవసరాలకు సంకేతంగా నిలుస్తోంది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: TGSPDCL power demand | తెలంగాణ Telangana లో విద్యుత్‌ వినియోగం మరోసారి రికార్డు స్థాయికి చేరింది. దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (TGSPDCL) చరిత్రలోనే అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌ నమోదైంది. మంగళవారం మధ్యాహ్నం 3.52 గంటలకు 12,044 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

TGSPDCL power demand | గతేడాది రికార్డు బద్దలు

గతేడాది సెప్టెంబర్‌ 11న TGSPDCL పరిధిలో 11,828 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ నమోదైంది. అదే ఇప్పటివరకు అత్యధిక డిమాండ్‌గా ఉండగా.. తాజాగా 12,044 మెగావాట్లకు చేరడంతో పాత రికార్డు బద్దలైంది. గత రికార్డుతో పోలిస్తే తాజా డిమాండ్‌ 216 మెగావాట్లు అధికంగా నమోదైంది.

Zee Entertainment Downfall Story | జీ ఎంటర్టైన్మెంట్ సంక్షోభం..సుభాష్ చంద్ర ‘జీ’ సామ్రాజ్యం ఎలా కుప్పకూలింది?

TGSPDCL power demand | 12 వేల మెగావాట్ల మార్క్‌ దాటిన డిమాండ్‌

విద్యుత్‌ డిమాండ్‌ తొలిసారిగా 12 వేల మెగావాట్ల కీలక మార్కును దాటడం తెలంగాణలో పెరుగుతున్న విద్యుత్‌ అవసరాలకు సంకేతంగా నిలుస్తోంది. మధ్యాహ్న సమయంలో నమోదైన ఈ గరిష్ఠ డిమాండ్‌.. రాష్ట్ర విద్యుత్‌ వ్యవస్థపై పెరుగుతున్న లోడ్‌ను స్పష్టంగా చూపిస్తోంది.

గతేడాది రికార్డును అధిగమిస్తూ 12,044 మెగావాట్లకు చేరిన విద్యుత్‌ డిమాండ్‌తో TGSPDCL చరిత్రలో కొత్త గరిష్ఠ స్థాయి నమోదైంది.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *