అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Indiramma Houses | పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే తమ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్స్ నిర్మించి పేదలకు అందిస్తామన్నారు.
నాంపల్లి (Nampally) నియోజకవర్గంలోని రెడ్ హిల్స్‌లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి మంగళవారం మంత్రి పొంగులేటి, మంత్రి అజారుద్దీన్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే హుస్సేన్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లబ్ధిదారులకు ఏడాది లోపు ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని తెలిపారు. నగరంలో ఎకరం భూమి విలువ రూ.200 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు ఉన్నా.. పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి కేటాయించామని చెప్పారు.
Indiramma Houses | 480 మందికి..
నాంపల్లిలో లక్కీ డ్రా నిర్వహించి 480 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని మంత్రి తెలిపారు. మిగిలిన వారికి రెండో, మూడో, నాలుగో విడతల్లోనూ ఇళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. పలు నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు. ఇందిరమ్మ టవర్స్‌లో నివసించే కుటుంబాలకు డ్రైనేజీ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులు పనులు జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించి తమ ఇల్లు నాణ్యతతో చేపడుతున్నారా లేదా అని పరిశీలించే అవకాశం కల్పిస్తామన్నారు.
దీనిని కూడా చదవండి : NIMS Doctor Assets | నిమ్స్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్.. బినామీల పేరిట భారీగా ఆస్తులు