Work From Bike | వర్క్​ ఫ్రమ్​ బైక్.. హెచ్చరించిన సీపీ సజ్జనార్​

హైదరాబాద్​ నగరంలో ఓ యువకుడు బైక్​పై వర్క్​ చేస్తూ కనిపించాడు. ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Work From Bike | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ఓ యువకుడు బైక్​పై వర్క్​ చేస్తూ కనిపించాడు. హైటెక్ సిటీలో ఫ్యూయల్ ట్యాంక్‌పై ల్యాప్‌టాప్‌ను ఉంచి, బైక్‌పై పనిచేస్తూ డ్రైవింగ్​ చేశాడు. ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది.

ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో మనిషికి విశ్రాంతి ఉండటం లేదు. ప్రైవేట్​ ఉద్యోగుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. సాఫ్ట్​వేర్​ ఉద్యోగులకు సైతం టాస్క్​లు ఇచ్చి టార్చర్​ పెడుతున్నారు. బతకాలంటే పని చేయాలి. అయితే తాము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో చెప్పినా కొందరు పై అధికారులు వినకుండా ఉద్యోగులను వేధిస్తున్నారు. తాజాగా బైక్​పై వర్క్​ చేస్తూ వెళ్తున్న యువకుడు.. అలా ఎందుకు చేశాడన్నది తెలియకున్నా పని ఒత్తిడి ఉంటేనే ఎవరైనా ప్రాణాలను పణంగా పెడతారు.

Work From Bike | భద్రత ముఖ్యం

ఇలా ప్ర‌మాద‌క‌రంగా ప్ర‌యాణం చేయ‌డంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు (Software Employees) ఎదుర్కొంటున్న ఒత్తిడి ఈ స్థాయిలో ఉందా? అని ప‌లువురు నెటిజ‌న్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా ప్రాణాలను పణంగా పెట్ట‌డం స‌రికాద‌ని.. భ‌ద్ర‌త ముఖ్య‌మ‌ని పేర్కొంటున్నారు. అత్యవసరం అయితే బైక్​ ఆపుకొని పని చేయాలి కానీ ఇలా డ్రైవింగ్​లో చేయడం సరికాదు అంటున్నారు. మనకు ఏదైనా అయితే పని చేసే కంపెనీ ఇతరులను ఉద్యోగంలో పెట్టుకుంటుంది. కానీ మన కుటుంబ పరిస్థితి ఏమిటనే విషయం ఆలోచించాలని నెటిజన్లు అంటున్నారు.

Work From Bike | ఇలాంటి పనులు చేయొద్దు

ఏ పనికైనా ఒక పద్ధతి ఉంటుంది. కానీ, ప్రాణాలను పణంగా పెట్టి ఇలా వర్క్ ఫ్రమ్ బైక్ చేయడం చూస్తుంటే… ఆత్రం ఎక్కువైతే ప్రాణం మీదకు వస్తుంది అనే మాట అక్షరాలా నిజమనిపిస్తోంది అని హైదరాబాద్ సీపీ సజ్జనార్​ అన్నారు. రోడ్డు మీద ఏకాగ్రత ఒక్క క్షణం తప్పినా, అది మీ ప్రాణానికే కాదు, పక్కన వెళ్లే అమాయకుల ప్రాణాలకు కూడా ప్రమాదకరమన్నారు. కడుపు నింపుకోవడానికి చేసే పని, కడతేర్చేలా ఉండకూడదని ఆయన హితవు పలికారు.

ఇది కూడా చదవండి..: Hyderabad Rain Havoc | హైదరాబాద్​లో వర్ష బీభత్సం.. ముగ్గురు మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *