RTC Bus Accident | లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు

ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: RTC Bus Accident | ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాటసింగారం గ్రామం సమీపంలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.

ఖమ్మం నుంచి హైదరాబాద్‌ (Hyderabad) వెళ్తున్న ఆర్టీసీ బస్సు లారీని ఢీకొంది. దీంతో అందులోని 15 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

RTC Bus Accident | వాహనదారులు జాగ్రత్త

చలికాలం ప్రారంభం అయింది. తెల్లవారుజామున మంచు భారీగా కురుస్తోంది. ఈ క్రమంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మంచు కురిసే సమయంలో ఎదురుగా ఉన్న వాహనాలు కనిపించవు. అతివేగంగా వెళ్లొద్దు. రోడ్డుపై వాహనాలు నిలిపితే పార్కింగ్​ లైట్లు వేయాలి.

ఇది కూడా చదవండి..:Telangana PRC Report | పీఆర్సీ ఎక్కడ? హామీ ఇచ్చి నెల దాటినా చలనం లేని సర్కార్‌!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *