Kannepalli Pump House | బ్యారేజీల సమస్య వస్తే రాజీనామా చేస్తాం.. ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఛాలెంజ్

కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Kannepalli Pump House | కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ క్రమంలో అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు ఏ చిన్న సమస్య ఎదురైనా, తాము అందరం బాధ్యత వహిస్తూ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తామని, మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయము. ఈ సవాల్‌ను స్వీకరించే ధైర్యం ముఖ్యమంత్రికి, మంత్రికి ఉందా అని ఆయన ప్రశ్నించారు. రైతుల ఆవేదనను చూసి తాము ఈ నిర్ణయం తీసుకున్నామని, రైతులకు నీళ్లు ఇచ్చే విషయంలో ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తోందని ఆయన ఆరోపించారు.

Kannepalli Pump House | రైతులకు నీరివ్వండి..

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై సీఎం ఎదురుదాడి చేస్తున్నారని కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం కాళేశ్వరంపై అబద్ధాలు ప్రచారం చేస్తూ, కన్నెపల్లి పంప్ హౌస్‌లను కావాలనే ఆన్ చేయడం లేదని ఆయన ఆరోపించారు. ఒకవేళ ప్రభుత్వం అనుకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్యకర్తల రక్తం తీసుకునైనా రైతులకు నీళ్లు అందించాలని డిమాండ్ చేశారు.

kowshik.1

Kannepalli Pump House | పంటలు కొనాల్సి వస్తుందనే భయంతో..

నీళ్లు ఇస్తే ఎరువులు ఇవ్వాల్సి వస్తుందని, పంటలు కొనాల్సి వస్తుందనే భయంతోనే ప్రభుత్వం రైతులకు నీటిని అందించడం లేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌ను నమ్మి ఓటు వేయడమే రైతులు చేసిన తప్పా అని ఆయన తీవ్రంగా ప్రశ్నించారు. ఉత్తర తెలంగాణ రైతుల పట్ల ప్రభుత్వం చూపుతున్న వివక్షపై బీఆర్ఎస్ నేతలు నిప్పులు చెరుగుతున్నారు.

 

ఇది కూడా చదవండి:  Warangal Airport | వేగవంతం కానున్న ఎయిర్‌పోర్టుల పనులు.. రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *