Oracle layoffs AI | ఏఐ వైపు ఒరాకిల్ అడుగులు.. ఏడాదిలో 21 వేల మంది ఉద్యోగులపై వేటు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత వ్యాపార వ్యూహాలను అమలు చేసే క్రమంలో అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ సంస్థ 'ఒరాకిల్' ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున సిబ్బందిని తొలగించింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Oracle layoffs AI | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత వ్యాపార వ్యూహాలను అమలు చేసే క్రమంలో అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ సంస్థ ‘ఒరాకిల్’  ( Oracle ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున సిబ్బందిని తొలగించింది. 2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఏకంగా 21,000 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్లు తాజా వార్షిక నివేదికలో వెల్లడించింది. దీంతో గత సంవత్సరం 1,62,000గా ఉన్న సంస్థ ఉద్యోగుల సంఖ్య, మే 31, 2026 నాటికి 1,41,000కు పడిపోయింది.

Oracle layoffs AI | ఏఐ విస్తరణ..

వ్యాపార కార్యకలాపాల్లో ఏఐ సాంకేతికతను విస్తృతంగా అమలు చేయడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది.కేవలం ఏఐ మాత్రమే కాకుండా.. మేనేజ్‌మెంట్ మార్పులు, ఉత్పత్తి వ్యూహాలు, ఉద్యోగుల పనితీరు, ఇతర కంపెనీల కొనుగోళ్లు కూడా ఈ తొలగింపులకు కారణమని పేర్కొంది. ఏఐ డేటా సెంటర్ల కోసం భారీగా నిధులు ఖర్చు చేస్తుండటంతో తలెత్తిన నగదు కొరతను అధిగమించేందుకు కంపెనీ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో కూడా మరిన్ని ఉద్యోగాల కోతలు ఉండే అవకాశం ఉందని సంస్థ సంకేతాలు ఇచ్చింది.

orasil.1

Oracle layoffs AI | ఏఐ లక్ష్యంగా భారీ పెట్టుబడులు..

ఒరాకిల్ సంస్థ కేవలం డేటాబేస్ సాఫ్ట్‌వేర్ కంపెనీగానే కాకుండా, ఏఐ , క్లౌడ్ కంప్యూటింగ్ రంగాల్లో అగ్రగామిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. OpenAI వంటి పెద్ద కస్టమర్ల కోసం భారీ డేటా సెంటర్లను నిర్మిస్తూ అమెజాన్ (AWS), మైక్రోసాఫ్ట్ (Azure) వంటి దిగ్గజాలకు పోటీ ఇస్తోంది. అయితే, ఈ ఏఐ ప్రయోగాల కోసం ఒరాకిల్ భారీగా అప్పులు , ఈక్విటీపై ఆధారపడుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు 70 బిలియన్ డాలర్ల మూలధన వ్యయం (CapEx) ఉంటుందని అంచనా వేస్తోంది.

Oracle layoffs AI | కంపెనీపై ఆర్థిక భారం..

ఏఐ దిశగా మారుతున్న క్రమంలో కంపెనీపై ఆర్థిక భారం గణనీయంగా పెరిగింది. 2026 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల తొలగింపు పరిహారం (Severance Payments), పునర్వ్యవస్థీకరణ కోసం ఒరాకిల్ ఏకంగా 1.84 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 15,000 కోట్లు) ఖర్చు చేసింది. ఇది గత ఆర్థిక సంవత్సరంలో ఉన్న 374 మిలియన్ డాలర్ల కంటే చాలా ఎక్కువ కావడం విశేషం.

ఇది కూడా చదవండి:  Basara Temple Theft | బాసర ఆలయంలో చోరీ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *