అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ajit Doval BRICS Security | ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న కొత్త భద్రతా సవాళ్లు, ఉగ్రవాద ముప్పుపై అప్రమత్తంగా ఉండాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌దోవల్ (Ajit Doval) అన్నారు. 16వ బ్రిక్స్ (BRICS) జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడారు.
బ్రిక్స్ విభిన్న అనుభవాలను పంచుకునే వేదిక అన్నారు. అశాంతి, మార్పుల మధ్య ఉన్న ఈ ప్రపంచంలో, సంఘర్షణ పరిష్కార యంత్రాంగాలు బలహీనపడుతున్నట్లు కనిపిస్తున్న తరుణంలో, మనకు ఒక ప్రత్యేకమైన పాత్ర ఉందని పేర్కొన్నారు. ఒక సమూహంగా మనం ఎలాంటి పాత్ర పోషించగలమనేది మనం లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలిపారు. సాంప్రదాయేతర ముప్పులు జాతీయ సరిహద్దులను దాటి విస్తరించాయని, సాంప్రదాయ ప్రతిస్పందనలను ఎదుర్కోగల సామర్థ్యాన్ని సంతరించుకున్నాయననారు. సాంకేతికత, రహ్యంగా సాగే ఉగ్రవాద కార్యకలాపాలు, సైబర్ ముప్పులు – ఇవన్నీ డిజిటలైజేషన్ వైపు వేగంగా సాగుతున్న ఈ ప్రపంచంలో మనకు ప్రధాన సవాళ్లుగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు.
Ajit Doval BRICS Security | ఇంధన భద్రతకు దోహదం
అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని (MOU) భారతదేశం స్వాగతిస్తోందని దోవల్ తెలిపారు. ఇది ఇంధన భద్రతకు దోహదపడుతుందన్నారు. హర్ముజ్ జలసంధి (Strait of Hormuz) అందుబాటులోకి రావడం చాలా సానుకూల పరిణామం అని పేర్కొన్నారు. ప్రపంచం సైనిక ఘర్షణలు, సంక్లిష్టమైన భద్రతా సమస్యలతో సతమతమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
Ajit Doval BRICS Security | శాంతికి చిహ్నం
వర్ధమాన ఆర్థిక వ్యవస్థల అనధికారిక కూటమిగా బ్రిక్స్ (BRICS) ను రూపొందించారని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక సహకారాన్ని పెంపొందించడం, గ్లోబల్ సౌత్ (Global South) వాణిని బలోపేతం చేయడం దీని ఉద్దేశం అని స్పష్టం చేశారు. బ్రిక్స్ అనేది శాంతి, పురోగతి, అభివృద్ధి, మరియు సహకారాన్ని విశ్వసించే దేశాల చాలా ప్రత్యేకమైన కూటమి అన్నారు.
ఇది కూడా చదవండి..: Kunal Shah WhatsApp CEO | వాట్సాప్ గ్లోబల్ హెడ్‌గా కునాల్ షా.. భారతీయ టెక్ రంగానికి మరో గౌరవం