జాతీయంBengal BJP Victory | బెంగాల్‌లో బీజేపీ సర్కార్ ఖాయం.. మే 4న రాష్ట్రమంతా మిఠాయిలే:...

Bengal BJP Victory | బెంగాల్‌లో బీజేపీ సర్కార్ ఖాయం.. మే 4న రాష్ట్రమంతా మిఠాయిలే: ప్రధాని మోదీ

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జయకేతనం ఎగురవేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bengal BJP Victory | పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) భారతీయ జనతా పార్టీ జయకేతనం ఎగురవేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో భాగంగా తన చివరి ర్యాలీలో పాల్గొన్న ఆయన, తదుపరిసారి బెంగాల్‌కు వచ్చేది బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికేనని ఆశాభావం వ్యక్తం చేశారు.

Bengal BJP Victory | మే 4న విజయోత్సవం:

ఎన్నికల ఫలితాలు వెలువడే మే 4వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా విజయోత్సవాలు జరుపుకుంటామని, మిఠాయిలు పంచుతామని ప్రధాని పేర్కొన్నారు. హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి తనను ఆశీర్వదించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

Bengal BJP Victory | దేశ ప్రజలే నా కుటుంబం:

“నాకంటూ ప్రత్యేకంగా కుటుంబం లేదు.. దేశ ప్రజలే నా కుటుంబం” అని మోదీ భావోద్వేగంగా మాట్లాడారు. గత నాలుగు దశాబ్దాలుగా దేశంలోని ప్రతి మూల పర్యటిస్తున్నానని, తనకు ఈ రోడ్‌షోలే పుణ్యయాత్రలతో సమానమని వ్యాఖ్యానించారు.

Bengal BJP Victory | టీఎంసీపై విమర్శల దాడి:

తృణమూల్ కాంగ్రెస్ తన సొంత నినాదమైన “మా-మాటి-మనుష్”ను మరిచిపోయిందని మోదీ విమర్శించారు. అభివృద్ధిని వదిలేసి దూషణలు, బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న దాడుల విషయంలో టీఎంసీ వైఫల్యాన్ని ఎండగట్టారు. బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి రాగానే మహిళలపై దాడులకు పాల్పడే నిందితులను కఠినంగా శిక్షిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి..: Mamata Banerjee | బెంగాల్​లో గెలుపు మాదే.. మమత బెనర్జీ

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....

Modi UAE Visit | ప్రధాని మోడీ విదేశీ పర్యటన.. యూఏఈలో కీలక భేటీ!

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Modi UAE Visit | ఐరోపా దేశాల్లో వచ్చే నెల...

IFS Officers Transfers | ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారుల బదిలీ

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IFS Officers Transfers | ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS)...