Udhayanidhi Stalin Remarks | అసెంబ్లీని సినిమా హాల్​లా మార్చిన సీఎం విజయ్​ : ఉదయనిధి స్టాలిన్​

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Udhayanidhi Stalin Remarks | టీవీకే ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీని సీఎం విజయ్ సినిమా హాల్‌లా మార్చారని విమర్శించారు.

తమిళనాడు అసెంబ్లీ (Tamil Nadu Assembly) సమావేశాలను మంగళవారం డీఎంకే వాకౌట్​ చేసింది. అనంతరం ఉదయనిధి స్టాలిన్​ మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో కూడా విజయ్ నటించడం మొదలు పెట్టారన్నారు. విజయ్ నటిస్తుంటే స్పీకర్ కట్ చెబుతున్నారని విమర్శించారు. మళ్లీ స్పీకర్ యాక్షన్ అంటే విజయ్ నటిస్తున్నారని ఆరోపించారు. రేపటి నుంచి అసెంబ్లీకి కార్‌వాన్‌, మేకప్ మ్యాన్, ఫైట్ మాస్టర్లను తీసుకొస్తారేమో అని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో మంత్రులు విజిల్ వేస్తున్నారు, త్వరలో ఐటమ్ సాంగ్స్‌కి డాన్సులు వేస్తారన్నారు.

Udhayanidhi Stalin Remarks | అసత్యాలు ప్రచారం

Udhayanidhi Stalin Remarks

విజయ్​ (CM Vijay) ఎన్నికల ప్రచారంలో మాట్లాడినట్లుగానే సభలో మాట్లాడారని విమర్శించారు. అసత్యాలను ప్రస్తావించడంతో తాము అభ్యంతరం వ్యక్తం చేశామని తెలిపారు. విమర్శలు హద్దులు దాటినప్పటికీ, ముఖ్యమంత్రి విజయ్ తనతో తెచ్చుకున్న ప్రసంగ పాఠాన్ని పూర్తిగా చదివేందుకు స్పీకర్ అనుమతించారన్నారు. తాను లేవనెత్తిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వలేదన్నారు. ఆయన ఎప్పుడూ మీడియాకు, ప్రతిపక్ష పార్టీలకు గానీ సమాధానం ఇవ్వరన్నారు. ముఖ్యమంత్రిగా ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనపై ఉందని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Padma Awards 2026 | ఢిల్లీ వేదికగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *