అంతర్జాతీయంUS Iran Tensions | అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. అగ్రరాజ్యానికి తప్పని భారీ నష్టం!

US Iran Tensions | అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. అగ్రరాజ్యానికి తప్పని భారీ నష్టం!

అమెరికా , ఇరాన్ మధ్య గత కొన్ని వారాలుగా సాగుతున్న యుద్ధ వాతావరణంలో ప్రస్తుతం తాత్కాలికంగా కాల్పుల విరమణ కొనసాగుతోంది.

అక్షరటుడే, వాషింగ్టన్ : US Iran Tensions | అమెరికా (America), ఇరాన్ మధ్య గత కొన్ని వారాలుగా సాగుతున్న యుద్ధ వాతావరణంలో ప్రస్తుతం తాత్కాలికంగా కాల్పుల విరమణ కొనసాగుతోంది. అయితే ఈ శాంతి ఎంతకాలం ఉంటుంది? ఇరు దేశాలు చర్చలకు వస్తాయా? అనే అంశాలపై ఇంకా స్పష్టత రాలేదు.

US Iran Tensions | నిఘా వ్యవస్థలు లక్ష్యంగా:

ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ (Israel) సంయుక్తంగా ఇరాన్‌పై దాడులు ప్రారంభించాయి. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై విరుచుకుపడింది.అమెరికాకు చెందిన కమాండ్ సెంటర్లను, రన్‌వేలను, నిఘా వ్యవస్థలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. అమెరికా వద్ద అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థలు ఉన్నప్పటికీ, ఇరాన్ తన పాత కాలపు ఎఫ్‌-5 (F-5) యుద్ధ విమానాలతో దాడి చేసి అమెరికాను ఆశ్చర్యపరిచినట్లు అంతర్జాతీయ కథనాలు చెబుతున్నాయి.

US Iran Tensions | నష్టాన్ని బయటపెట్టడం లేదని :

ఇరాన్ దాడుల్లో జరిగిన అసలు నష్టాన్ని ట్రంప్ (Trump) ప్రభుత్వం బయటపెట్టడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. రిపబ్లికన్ పార్టీ నేతలు సైతం పారదర్శకత లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్థిక భారం: యుద్ధం కారణంగా అమెరికా ఆర్థికంగా భారీ మూల్యాన్ని చెల్లించుకుంటోంది. యుద్ధం మొదలైన మొదటి వారంలోనే అమెరికా సుమారు 11 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. యుద్ధ కార్యకలాపాలు , దెబ్బతిన్న వ్యవస్థలను పునరుద్ధరించడానికి మరో 200 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 18 లక్షల కోట్లు) అదనపు నిధులు కావాలని పెంటగాన్ పార్లమెంటును కోరింది.

బడ్జెట్‌ను 50% పెంచి: ఇప్పటికే అమెరికా తన రక్షణ బడ్జెట్‌ను 50% పెంచి 1.5 ట్రిలియన్ డాలర్లకు చేర్చింది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి పాకిస్థాన్ (Pakistan) చేస్తున్న ప్రయత్నాలపై ఇరాన్ పెదవి విరిచింది. పాకిస్థాన్ సరైన మధ్యవర్తి కాదని ఇరాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.ప్రస్తుతానికి తుపాకులు నిశ్శబ్దంగా ఉన్నా, తెరవెనుక రాజకీయాలు , ఆర్థిక నష్టాల భయం ఇరు దేశాలను వెంటాడుతున్నాయి.

ఇది కూడా చదవండి..: Iran Warns US | నాలుగు రెట్ల విధ్వంసం చేస్తాం.. అమెరికాకు ఇరాన్​ వార్నింగ్​

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....

Modi UAE Visit | ప్రధాని మోడీ విదేశీ పర్యటన.. యూఏఈలో కీలక భేటీ!

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Modi UAE Visit | ఐరోపా దేశాల్లో వచ్చే నెల...

IFS Officers Transfers | ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారుల బదిలీ

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IFS Officers Transfers | ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS)...