Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - జాతీయం

జాతీయంఅంతర్జాతీయం

US Tariffs Proposal | భారత్‌కు అమెరికా మరో షాక్.. 12.5శాతం అదనపు సుంకాలకు ప్రతిపాదన

Balla Sandeep Kumar
Last updated: June 3, 2026, 12:25 pm 12:25 pm
Balla Sandeep Kumar
Share
US Tariffs Proposal

అక్షరటుడే, వెబ్​డెస్క్: US Tariffs Proposal | అనుచిత వాణిజ్య పద్ధతులలో పాల్గొంటున్నాయని ఆరోపిస్తూ యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యూఎస్టీఆర్ ) కార్యాలయం పలు దేశాలు, ఆర్థిక వ్యవస్థలపై వాణిజ్య చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది.

ఈ జాబితాలో భారతదేశాన్నీ చేర్చింది. బలవంతపు శ్రమ ద్వారా తయారైన వస్తువుల దిగుమతులను నిషేధించడంలో, అలాగే ఆ నిషేధాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో ఈ దేశాలు విఫలమయ్యాయని అమెరికా ఆరోపిస్తోంది. 1974 ట్రేడ్ యాక్ట్‌లోని సెక్షన్ 301 కింద నిర్వహించిన దర్యాప్తు అనంతరం ఈ నిర్ణయానికి వచ్చినట్లు యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (US Trade Representative) పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయా దేశాలనుంచి చేసుకునే దిగుమతులపై 12.5 శాతం వరకు అదనపు సుంకాలను విధించాలని ప్రతిపాదించింది.

US Tariffs Proposal | 54 దేశాలపై 12.5 శాతం అదనపు సుంకాలు..

US Tariffs Proposalవెట్టిచాకిరీ చేసే కార్మికులు తయారుచేసిన దిగుమతులపై నిషేధం విధించి, వాటిని అమలు చేయడంలో పలు దేశాలు విఫలమయ్యాయని (యూఎస్టీఆర్ ) ఆరోపిస్తోంది. ఆయా దేశాల విధానాలు, చర్యలు అమెరికా వాణిజ్య ప్రయోజనాలకు భారం కలిగిస్తున్నాయని, అమెరికన్ వ్యాపారాలకు నష్టాన్ని కలిగిస్తున్నాయని ఆ సంస్థ పేర్కొంటోంది. ఈ ఆరోపణలకు సంబంధించి 60 దేశాలపై దర్యాప్తు జరిపినట్లు చెబుతున్న సదరు సంస్థ.. 54 దేశాలపై 12.5 శాతం అదనపు సుంకాలను ప్రతిపాదించింది. మిగిలిన దేశాలపై 10 శాతం సుంకాలు విధించాలని ప్రతిపాదన తీసుకువచ్చింది.

US Tariffs Proposal | ఏ ఏ దేశాలపై విధిస్తారంటే..

US Tariffs Proposal

భారత్‌తో పాటు చైనా, జపాన్, బ్రెజిల్, ఆస్ట్రేలియా, యూకే, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, మలేషియా, ఖతార్, రష్యా, సింగపూర్, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వియత్నాం, థాయ్‌లాండ్, తైవాన్ తదితర 54 దేశాలపై 12.5 శాతం అదనపు సుంకాలను విధించాలని ప్రతిపాదించారు. కెనడా, ఈక్వెడార్, ఈయూ, ఇండోనేసియా, మెక్సికో, పాకిస్థాన్ దేశాలపై 10 శాతం అదనపు సుంకాలు విధించాలని యోచిస్తోంది. కాగా ఈ సుంకాలపై చర్చించేందుకు ఆయా దేశాలకు జూన్ 22 వరకు గడువు ఇచ్చింది.

US Tariffs Proposal | ఖండించిన భారత్..

భారత్ -అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం తొలి దశను ఖరారు చేసే దిశగా చర్చలు జరుగుతున్న సమయంలో ఈ అదనపు సుంకాల ప్రతిపాదన రావడం విస్మయానికి గురిచేస్తోంది. కాగా యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ చేసిన ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి వాటిని ద్వైపాక్షిక వాణిజ్య చర్చల్లో పరిష్కరించుకోవాలని పేర్కొంది. తమ దేశంపై దర్యాప్తును వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేసింది.

ఇది కూడా చదవండి..: Gold Price Today | స్థిరంగా పసిడి.. స్వల్పంగా తగ్గిన వెండి!

TAGGED:Additional Tariffsglobal trade newsIndia Export MarketIndia US TradeInternational CommerceTrade PolicyUS Tariffs ProposalUS Trade Representative
ByBalla Sandeep Kumar
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article ACB Raids Hyderabad ACB Raids Hyderabad | ఫోన్​ ట్యాపింగ్​ కేసులో కీలక పరిణామం.. భుజంగరావు ఇళ్లలో ఏసీబీ సోదాలు
Next Article Pension Live Authentication Pension Live Authentication | వినాయక్​నగర్​లో పింఛన్ లైవ్​​ అథెంటికేషన్ ​
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Tamil Nadu Election Trends
జాతీయం

Tamil Nadu Election Trends| స్టాలిన్ వారసుడికి ఎదురుగాలి.. చెపాకంలో వెనుకంజలో ఉదయనిధి!

By Shivam nagarani
US Iran Tensions
అంతర్జాతీయం

US Iran Tensions | అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. అగ్రరాజ్యానికి తప్పని భారీ నష్టం!

By Balla Sandeep Kumar
Mamata Banerjee setback
జాతీయం

Mamata Banerjee setback | భవానీపూర్​లో మమత వెనుకంజ.. నందిగ్రామ్​లో సీఎం అభ్యర్థి సువేందు గెలుపు!

By Naresh Chandan
Trump Xi Meeting
అంతర్జాతీయం

Trump Xi Meeting | జిన్​పింగ్​ గొప్ప స్నేహితుడు : డోనాల్డ్ ట్రంప్​

By Srinivas Kolluri
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.