Dharmendra Pradhan Resignation | విద్యార్థుల నిరసనకు కేటీఆర్ మద్దతు

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ విద్యార్థులు చేపట్టిన నిరసనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మద్దతు తెలిపారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Dharmendra Pradhan Resignation | కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ విద్యార్థులు చేపట్టిన నిరసనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR )మద్దతు తెలిపారు. ఈ మేరకు బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో శుక్రవారం ( జులై 24 )ఉదయం 10 గంటలకు ఇందిరా పార్కు వద్ద నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో కేటీఆర్ స్వయంగా పాల్గొననున్నారు.

Dharmendra Pradhan Resignation | పెరుగుతున్న మద్దతు..

ఢిల్లీలో విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు దేశవ్యాప్తంగా వివిధ పార్టీలు మద్దతు ప్రకటిస్తున్నాయి. శివసేన నేతలు జంతర్ మంతర్ వద్దకు వెళ్లి తమ సంఘీభావం తెలపగా.. ఎన్సీపీ నాయకులు ప్రధాని మోడీకి నివేదిక సమర్పించి ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించాలని కోరారు. దాదాపు కూటమేతర పార్టీలన్నీ ఇదే డిమాండ్‌తో నిరసనలు తెలుపుతున్నాయి.

Dharmendra Pradhan Resignation | కేంద్రం స్పందన ..

ఈ డిమాండ్లపై కేంద్రం ఇంకా అధికారికంగా స్పందించలేదు. మరోవైపు, సమస్యను వెంటనే పరిష్కరించి, నిందితులను శిక్షించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చినప్పటికీ.. విద్యార్థుల ఆందోళనలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.

ఇది కూడా చదవండి:  Extranet Technologies IPO | మార్కెట్‌లో ఐపీవోల సందడి.. అందుబాటులోకి ఐటీ సొల్యూషన్స్ ప్రొవైడర్

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *