Plastic Currency Notes | భారతీయ కరెన్సీలో విప్లవాత్మక మార్పులు.. ప్లాస్టిక్ నోట్ల ముద్రణకు గ్రీన్ సిగ్నల్

భారతీయ కరెన్సీ రంగంలో విప్లవాత్మక మార్పులకు రంగం సిద్ధమవుతోంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Plastic Currency Notes | భారతీయ కరెన్సీ రంగంలో విప్లవాత్మక మార్పులకు రంగం సిద్ధమవుతోంది. దేశంలో తొలిసారిగా పాలిమర్ లేదా ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆమోదం తెలిపాయి. ఇందులో భాగంగా అత్యధికంగా చెలామణిలో ఉండే తక్కువ విలువ కలిగిన రూ.10, రూ.20 నోట్లను ప్లాస్టిక్ మెటీరియల్‌తో ముద్రించి, ఫీల్డ్‌లో ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రిజర్వ్ బ్యాంక్ చేసిన ప్రతిపాదన మేరకు తొలుత వంద కోట్ల చొప్పున ఈ నోట్లను మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.

Plastic Currency Notes | ప్లాస్టిక్ నోట్ల ప్రత్యేకతలు..

సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే ప్లాస్టిక్ నోట్ల ఆయుష్షు చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా రూ.10, రూ.20 వంటి చిన్న నోట్లు చేతులు మారుతుండటం వల్ల త్వరగా పాడైపోతుంటాయి. పాలిమర్ నోట్ల ద్వారా ఆ సమస్య తీరడంతో పాటు నకిలీ నోట్ల బెడదను కూడా సమర్థవంతంగా అరికట్టవచ్చని భావిస్తున్నారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే, అంతా అనుకున్నట్లుగా జరిగితే 2027 ఏప్రిల్ నాటికి ప్లాస్టిక్ నోట్లను పూర్తిస్థాయిలో సర్క్యులేషన్‌లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఇటీవల తెలిపారు. ప్రస్తుతానికి ఇది కేవలం ప్రయోగాత్మక దశ మాత్రమేనని, మార్కెట్లో ఉన్న పాత కాగితపు నోట్లు యథావిధిగా కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Shiprocket IPO | ఐపీవోకు షిప్ రాకెట్.. ఊరిస్తున్న జీఎంపీ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *