Shiprocket IPO | ఐపీవోకు షిప్ రాకెట్.. ఊరిస్తున్న జీఎంపీ

ఈ-కామర్స్ వ్యాపారాలకు లాజిస్టిక్స్, చెకౌట్, పేమెంట్స్ సేవలు అందించే షిప్‌రాకెట్ పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. బుధవారం నుంచి సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులో ఉండనుంది.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Shiprocket IPO | షిప్‌రాకెట్ సంస్థను 2011 లో ఏర్పాటు చేశారు. ఇది దేశంలోని ఎంఎసఎంఈ లు, పెద్ద రిటైలర్లు సులభంగా ఆన్‌లైన్ వర్తకం చేయడానికి ఉపయోగపడే ఎండ్ టు ఎండ్, ఏపీఐ ఆధారిత టెక్నాలజీ ప్లాట్‌ఫాం. లాజిస్టిక్స్, ఆర్డర్ ఫుల్‌ఫిల్‌మెంట్, పేమెంట్లు, అంతర్జాతీయ రవాణా వంటి సేవలను ఈ సంస్థ అందిస్తోంది.

Shiprocket IPO | రూ. 1,617.48 కోట్ల ఐపీవో..

మార్కెట్ నుంచి రూ. 1,617.48 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో షిప్‌రాకెట్ కంపెనీ ఐపీవో (IPO)కు వస్తోంది. ఇందులో ఫ్రెష్ ఇష్యూ ద్వారా రూ. 885.50 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ. 731.98 కోట్లు సమీకరించనున్నారు. ఫ్రెష్ ఇష్యూ ద్వారా సేకరించే నిధులను మార్కెటింగ్ కార్యక్రమాలు, టెక్నాలజీ మౌలిక వసతుల విస్తరణ, అప్పుల చెల్లింపు, భవిష్యత్తులో వ్యూహాత్మక కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది.

Shiprocket IPO | ప్రైస్ బ్యాండ్..

కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ. 92 నుంచి రూ. 97 గా నిర్ణయించింది. ఒక లాట్ లో 154 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ కోసం గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద రూ. 14,938తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గరిష్టంగా 13 లాట్ల వరకు బిడ్లు వేయొచ్చు.

కోటా : ఐపీవోలో క్యూఐబీలకు 75 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 10 శాతం, ఎనఐఐలకు 15 శాతం షేర్లను కేటాయించారు.

జీఎంపీ : షిప్‌రాకెట్ షేర్లకు గ్రే మార్కెట్‌లో మంచి గిరాకీ కనిపిస్తోంది. ఒక్కో షేరుపై రూ. 27 గ్రే మార్కెట్ ప్రీమియం ఉంది. అంటే ఐపీవో అలాట్ అయితే లిస్టింగ్ సమయంలో 27 శాతం లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

ముఖ్యమైన తేదీలు : ఆగస్టు 12న ప్రారంభమై ఆగస్టు 14 వరకు ఐపీవో సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో ఉంటుంది. ఆగస్టు 17న రాత్రి షేర్ల కేటాయింపు జరుగుతుంది. ఆగస్టు 19న కంపెనీ షేర్లు బీఎస్ ఈ, ఎన్ ఎస్ ఈ లలో లిస్టవుతాయి.

ఇది కూడా చదవండి..: PM E-DRIVE Subsidy | ఈవీ కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్.. పీఎం ఇ-డ్రైవ్ సబ్సిడీ గడువు పొడిగించిన కేంద్రం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *