అక్షరటుడే, వెబ్‌డెస్క్ : PM E-DRIVE Subsidy | పెట్రోల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ టూ వీలర్లను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం ఇ-డ్రైవ్ పథకం ప్రవేశపెట్టింది.
ఈ పథకంలో భాగంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి సబ్సిడీ అందిస్తోంది. మొదట ఈ స్కీమ్‌ను రెండేళ్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2024 అక్టోబర్ 1న పథకాన్ని తీసుకువచ్చారు. ఆ గడువు 2026 మార్చి 31తో ముగియనుంది. ఈ గడువును రెండేళ్లు పొడిగిస్తూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది.
PM E-DRIVE Subsidy | సబ్సిడీ ఎంతంటే..?
ఈ స్కీమ్ కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు (Electric Two-Wheelers) కిలోవాట్ అవర్ ప్రాతిపదికన సబ్సిడీ చెల్లిస్తారు. 2024-25లో కిలోవాట్ అవర్‌కు రూ. 5 వేలు, ఒక వాహనానికి గరిష్టంగా రూ. 10 వేల వరకు సబ్సిడీ అందించారు. ప్రస్తుతం కిలోవాట్ అవర్‌కు రూ. 2,500 చొప్పున సబ్సిడీ చెల్లిస్తున్నారు. ఒక వాహనానికి గరిష్టంగా రూ. 5 వేలు సబ్సిడీ అందుతోంది. ధర రూ.1.5 లక్షలు(ఎక్స్‌షోరూమ్) దాటని వాహనాలకే ఈ సబ్సిడీ వర్తిస్తుంది.
PM E-DRIVE Subsidy | సబ్సిడీ మొత్తం పెంపు..
ఎలక్ట్రిక్ టూ వీలర్లకు సబ్సిడీ మొత్తాన్ని వెయ్యి కోట్ల రూపాయలు పెంచారు. గతంలో రూ. 1,772 కోట్ల నుంచి రూ. 2,767 కోట్లకు పెంచింది. సబ్సిడీకి అర్హత పొందే వాహనాల సంఖ్యను కూడా భారీగా పెంచింది. ఇంకా గరిష్ఠంగా ఒక్కో వాహనానికి రూ. 5 వేల సబ్సిడీ వస్తుంది.
PM E-DRIVE Subsidy | రూ. 2,767 కోట్ల కేటాయింపు..
ఈ పథకంలో భాగంగా ఎలక్ట్రిక్ టూ వీలర్లపై అందించే సబ్సిడీ కోసం ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలు పెంచింది. ఇది గతంలో రూ. 1,772 కోట్లు ఉండగా.. ప్రస్తుతం రూ. 2,767 కోట్లకు పెంచడం గమనార్హం. ఈ మొత్తంతో 45,79,120 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సబ్సిడీ అందనుంది.
ఇది కూడా చదవండి..: Gautam Adani Case | గౌతమ్ అదానీకి ఊరట.. కోర్టులో క్రిమినల్ ఆరోపణలు కొట్టివేత