Gautam Adani Case | గౌతమ్ అదానీకి ఊరట.. కోర్టులో క్రిమినల్ ఆరోపణలు కొట్టివేత

అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికా కోర్టులో కొనసాగుతున్న క్రిమినల్ ఆరోపణలు తొలగిపోయాయి.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Gautam Adani Case | అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికా కోర్టులో కొనసాగుతున్న క్రిమినల్ ఆరోపణలు తొలగిపోయాయి. మోసం, లంచం వంటి తీవ్రమైన అభియోగాలకు సంబంధించి దాదాపు రెండేళ్లుగా సాగుతున్న విచారణను న్యాయస్థానం ముగిస్తూ ఆ కేసును కొట్టివేసింది. అయితే, ఈ కేసును ఉపసంహరించుకోవాలన్న న్యాయ శాఖ నిర్ణయంపై కోర్టు కొంత ఆందోళన వ్యక్తం చేసింది. మిగతా నిందితులపై అభియోగాలను పూర్తిగా ఎత్తివేయాలా వద్దా అనే అంశంపై స్పష్టత కోసం మరిన్ని వివరాలు సమర్పించాలని న్యాయ శాఖను ఆదేశించింది. అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు తీసుకున్న ఈ నిర్ణయాన్ని గౌతమ్ అదానీ స్వాగతించారు. న్యాయవ్యవస్థపై తనకు ఉన్న నమ్మకమే చివరకు గెలిచిందని ఆయన పేర్కొన్నారు.

Gautam Adani Case | ఆరోపణల నేపథ్యం ఇదే..

భారతదేశంలో సౌర విద్యుత్ సరఫరా ఒప్పందాలు దక్కించుకోవడం కోసం స్థానిక అధికారులకు సుమారు 250 మిలియన్ డాలర్ల వరకు లంచాలు చెల్లించారనేది అదానీపై ఉన్న ప్రధాన అభియోగం. అమెరికా మార్కెట్ల నుంచి పెట్టుబడులు సేకరించే సమయంలో ఈ లంచాల వ్యవహారాన్ని దాచిపెట్టి, ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో (2024లో) అదానీతో పాటు మరో ఏడుగురిపై ఈ కేసులు నమోదయ్యాయి. తాజా పరిణామంలో భాగంగా ఈ అభియోగాలను ఉపసంహరించుకోవాలని అమెరికా న్యాయ శాఖ కోరడంతో కోర్టు ఈ నిర్ణయం వెలువరించింది.

 

ఇది కూడా చదవండి:  Manmohan Singh Case | మన్మోహన్ సింగ్‌కు క్లీన్ చిట్ చారిత్రాత్మకం: సోనియా గాంధీ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *